వీసా గడువు ముగిసినా వెళ్లని క్రికెటర్‌

28 Nov, 2019 11:58 IST|Sakshi

కోల్‌కతా:  వీసా గడువు ముగిసినా తమ దేశానికి వెళ్లకపోవడంతో బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ సైఫ్‌ హసన్‌కు భారీ జరిమానా పడింది. భారత్‌తో ద్వైపాక్షిక క్రికెట్‌ సిరీస్‌లో భాగంగా ఇక్కడికి వచ్చిన సైఫ్‌ హసన్‌ వీసా గడువు ఆదివారం(నవంబర్‌ 24వ తేదీ) వరకూ మాత్రమే ఉంది.  అయితే సోమవారం ఉదయం కోల్‌కతాలోని ఎన్‌ఎస్‌సీబీఐ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన సైఫ్‌ హసన్‌ను అక్కడ అధికారులు అడ్డుకున్నారు.  ఆ వీసా గడువు ముగిసిపోవడంతో హసన్‌న ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అతనికి రూ. 21, 600 జరిమానా చెల్లించుకున్నాడు.

ఈ సిరీస్‌కు రిజర్వ్‌ ఓపెనర్‌గా వచ్చిన సైఫ్‌ హసన్‌.. పింక్‌ బాల్‌ టెస్టు ముందే సిరీస్‌ నుంచే వైదొలిగాడు. దాంతో అతను ఆదివారం స్వదేశానికి వెళ్లాల్సి ఉంది. కాకపోతే అదనంగా మరో రోజులు ఉండటంతో అతనికి ఇబ్బందులు తప్పలేదు. అటు ఎయిర్‌పోర్ట్‌ అధికారుల చేతుల్లో పరాభవంతో పాటు భారీ జరిమానా బారిన పడ్డాడు. ఢాకాలో ఉన్న భారత హైకమిషన్‌ జోక్యంతో హసన్‌కు అవసరమైన వీసాను బుధవారం మంజూరు చేశారు. దాంతో ఎట్టకేలకు స్వదేశానికి బయల్దేరి వెళ్లాడు. ఇటీవల భారత్‌లో వీసా గడువు ముగిసినా ఇక్కడ ఉంటే భారీ జరిమానాలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతో హసన్‌కు భారీ జరిమానా పడింది.

మరిన్ని వార్తలు