ఇండోనేషియా ప్రిక్వార్టర్స్ కి సైనా, కశ్యప్

3 Jun, 2015 16:43 IST|Sakshi
ఇండోనేషియా ప్రిక్వార్టర్స్ కి సైనా, కశ్యప్

జకర్తా: భారత నం.1 స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సింగిల్స్ విభాగంలో ఇండోనేషియా ఓపెన్ ప్రిక్వార్టర్స్ లో ప్రవేశించింది. పి.వి.సిందూ ఇంటి దారి పట్టింది. పురుషుల కేటగిరిలో పారుపల్లి కశ్యప్ సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్స్ కి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన మ్యాచ్ లో థాయ్లాండ్ కి చెందిన నిచాన్ జిందాపొన్పై 21-16, 21-18 తేడాతో విజయం సాధించింది. తొలిసెట్ ను సులువుగా కైవసం చేసుకున్న సైనాకు రెండోసెట్ లో కొంత ప్రతిఘటన ఎదురైంది. ఓ దశలో 18-17 తో వెనకబడి ఉన్న సైనా వరుసగా నాలుగు పాయింట్లు తన ఖాతాలో వేసుకొని విజయం సాధించింది. 2009, 2010, 2012 సంవత్సరాలలో సైనా ఇండోనేషియా ఓపెన్ నెగ్గిన విషయం తెలిసిందే. పారుపల్లి కశ్యప్ 21-17, 21-7 తేడాతో వరుస సెట్లను కైవసం చేసుకొని థాయ్లాండ్ కి చెందిన టనొంగ్ సాక్ పై విజయం సాధించాడు. ఈ రెండు సెట్లను కేవలం 29 నిమిషాల్లోనే ముగించడం విశేషం.

సిందూ ఓటమి
హైదరాబాదీ షట్లర్ పి.వి.సిందూ 21-15, 21- 14 తేడాతో వరస సెట్లు కోల్పోయి చైనాకి చెందిన క్రీడాకారిణి హు యా చింగ్ చేతిలో ఓటమిపాలైంది. ఈ ఓటమితో సిందూ రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది.

మరిన్ని వార్తలు