సైనా, శ్రీకాంత్‌లకు షాక్‌

17 Oct, 2019 03:25 IST|Sakshi

డెన్మార్క్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లోనే ఓడిన భారత స్టార్స్‌

ఒడెన్స్‌: ఈ సీజన్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లకు మరోసారి నిరాశ ఎదురైంది. డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నమెంట్‌లో ఈ ఇద్దరు మాజీ చాంపియన్స్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఎనిమిదో సీడ్‌ సైనా 15–21, 21–23తో సయాక తకహాషి (జపాన్‌) చేతిలో పరాజయం పాలైంది. ఈ ఏడాది తకహాషి చేతిలో సైనా ఓడిపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. మోకాలి గాయంతో చైనా ఓపెన్, కొరియా ఓపెన్‌ టోరీ్నల్లో బరిలోకి దిగని శ్రీకాంత్‌ డెన్మార్క్‌ ఓపెన్‌లో ఆకట్టుకోలేకపోయాడు. ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌ 14–21, 18–21తో నాలుగో సీడ్‌ ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓటమి చవిచూశాడు. 2017 ప్రపంచ చాంపియన్‌íÙప్‌లో ఆంటోన్సెన్‌పై ఇదే స్కోరుతో శ్రీకాంత్‌ గెలుపొందడం విశేషం.

గత రెండేళ్లలో ఆంటోన్సెన్‌ ఆటతీరులో ఎంతో పురోగతి కనిపించింది. ఈ ఏడాది ఇండోనేసియా మాస్టర్స్, బార్సిలోనా మాస్టర్స్, యూరోపియన్‌ గేమ్స్‌లలో స్వర్ణాలు నెగ్గిన ఆంటోన్సెన్‌ ప్రపంచ చాంపియన్‌íÙప్‌లో రన్నరప్‌గా నిలిచాడు. పురుషుల సింగిల్స్‌ మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో భారత ప్లేయర్‌ సమీర్‌ వర్మ 21–11, 21–11తో సునెయామ (జపాన్‌)పై గెలిచాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా (భారత్‌) జంట 21–16, 21–11తో మారి్వన్‌ సీడెల్‌–లిండా ఎఫ్లెర్‌ (జర్మనీ) జోడీపై నెగ్గింది. రెండో సీడ్‌ వాంగ్‌ యి లియు–హువాంగ్‌ డాంగ్‌ పింగ్‌ (చైనా) జోడీకి సాతి్వక్‌ సాయిరాజ్‌–అశి్వని పొన్నప్ప జంట వాకోవర్‌ ఇచి్చంది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా