క్వార్టర్స్‌లో సైనా, శ్రీకాంత్‌

18 Jan, 2019 02:20 IST|Sakshi

మలేసియా మాస్టర్స్‌ టోర్నీ 

కౌలాలంపూర్‌: కొత్త ఏడాది ఆరంభ టోర్నీ మలేసియా మాస్టర్స్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ ప్లేయర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌ ముందంజ వేశారు. సింగిల్స్‌ విభాగంలో వీరిద్దరూ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌ విభాగంలో కామన్వెల్త్‌ గేమ్స్‌ మాజీ చాంపియన్‌ పారుపల్లి కశ్యప్‌... మహిళల డబుల్స్‌ కేటగిరీలో అశ్విని పొన్నప్ప– సిక్కిరెడ్డి జోడీ రెండో రౌండ్‌లోనే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ఏడో సీడ్‌ సైనా (భారత్‌) 21–14, 21–16తో పుయ్‌ యిన్‌ యిప్‌ (హాంకాంగ్‌)పై వరుస గేముల్లో కేవలం 39 నిమిషాల్లోనే గెలుపొందింది.

నేడు జరిగే క్వార్టర్స్‌లో 2017 ప్రపంచ చాంపియన్, రెండో సీడ్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)తో లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సైనా తలపడుతుంది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్న సైనా ముఖాముఖీ రికార్డులో 8–4తో ఒకుహారా (వరల్డ్‌ నెం.2)పై ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ఏడో సీడ్‌ శ్రీకాంత్‌ (భారత్‌) 23–21, 8–21, 21–18తో వాంగ్‌ వింగ్‌ కి విన్సెంట్‌ (హాంకాంగ్‌)పై పోరాడి గెలిచాడు. నేటి మ్యాచ్‌లో నాలుగో సీడ్‌ సన్‌వాన్‌హో (కొరియా)తో శ్రీకాంత్‌ తలపడతాడు. మరో మ్యాచ్‌లో క్వాలిఫయర్‌ కశ్యప్‌ 17–21, 23–25తో ఆరోసీడ్‌ ఆంథోని సినిసుకా జింటింగ్‌ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. మహిళల డబుల్స్‌ రెండోరౌండ్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి (భారత్‌) ద్వయం 18–21, 17–21తో ని కెటుట్‌ మహాదేవి ఇస్తారాణి– రిజ్కీ అమేలియా ప్రదీప్త (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిర్యానీ కోసం పాక్‌ వరకూ ఎందుకులే!

నా భర్త నిజాయితీనే ప్రశ్నిస్తారా?

రవిశాస్త్రి అలా.. రోహిత్‌ ఇలా!

శ్రీలంక క్లీన్‌స్వీప్‌

ఆబిద్‌ అలీఖాన్‌కు స్వర్ణ పతకం

జైపూర్‌ హ్యాట్రిక్‌

మెరుగైన శిక్షణ అందించడమే నాదల్‌ లక్ష్యం 

తండ్రి లేడు... అమ్మ టైలర్‌

మా సమర్థతకు అనేక ఉదాహరణలు

శ్రమించి నెగ్గిన శ్రీకాంత్, సాయిప్రణీత్‌

యాషెస్‌ సమరానికి సై..

కోహ్లికి ఆ హక్కుంది: గంగూలీ

టాప్‌ టెన్‌లో సింధు, సైనా

పాపం పృథ్వీ షా.. ఎంత దురదృష్టవంతుడో..!

‘ఖేల్‌ రత్న’ తిరస్కరణ: భజ్జీ ఆవేదన 

కోహ్లి మాటలు పట్టించుకోం : గైక్వాడ్‌

ఆ ‘ఓవర్‌ త్రో’పై కుండబద్దలు కొట్టిన స్టోక్స్‌

ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన బౌలర్‌ ఎవరో తెలుసా?

నేటి క్రీడా విశేషాలు

కోహ్లికి మద్దతు పలికిన పాక్‌ క్రికెటర్‌

ఇదేమీ బౌలింగ్‌ యాక‌్షన్‌ రా బాబు!

ప్రిక్వార్టర్స్‌లో సాయి దేదీప్య

విజేత హిందూ పబ్లిక్‌ స్కూల్‌ 

ప్రిక్వార్టర్స్‌లో ప్రజ్నేశ్‌ 

మెయిన్‌ ‘డ్రా’కు సాయి ఉత్తేజిత 

సైనిక విధుల్లో చేరిన ధోని

కరువు సీమలో మరో టెండూల్కర్‌

అంతా నా తలరాత.. : పృథ్వీషా

క్రికెట్‌కు వేణు గుడ్‌బై 

భారత హెడ్‌ కోచ్‌ పదవి రేసులో జయవర్ధనే! 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అవును.. ఇది నిజమే : శిల్పాశెట్టి

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?

మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక