క్వార్టర్స్కు సైనా

24 Nov, 2016 15:20 IST|Sakshi
క్వార్టర్స్కు సైనా

కౌలూన్:భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రి-క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సైనా నెహ్వాల్ 18-21, 21-9, 21-16 తేడాతో పదకొండో ర్యాంకర్ సయాకా శాటో(జపాన్)పై గెలిచి క్వార్టర్స్ కు చేరింది. తొలి గేమ్లో పోరాడి ఓడిన సైనా.. రెండో గేమ్లో మాత్రం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 

 

ఆ గేమ్లో పెద్దగా తప్పిదాలు ఆస్కారం ఇవ్వని సైనా 21-9 తో గెలిచింది. ఆ తరువాత నిర్ణయాత్మక మూడో గేమ్లో సయాకా నుంచి సైనాకు ప్రతిఘటన ఎదురైంది. కాగా, తను అనుభవాన్ని ఉపయోగించిన సైనా ఎట్టకేలకు సయాకను వెనక్కు నెట్టి విజయాన్ని సొంతం చేసుకుంది. రియో ఒలింపిక్స్ తరువాత గాయం నుంచి కోలుకున్న సైనాకు ఇది రెండో విజయం. 2010లో హాంకాంగ్ ఓపెన్ను సైనా తొలిసారి గెలిచింది. మరోసారి హాంకాంగ్ ఓపెన్ సాధించి తన పూర్వ వైభవాన్ని చాటుకోవాలని సైనా భావిస్తోంది.

మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ 21-15, 11-21, 15-21 తేడాతో చాంగ్ వుయ్ ఫెంగ్(మలేషియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇదిలా ఉండగా, సమీర్ వర్మ ప్రి-క్వార్టర్స్ అడ్డంకిని అధిగమించాడు. సమీర్ 19-21, 21-15, 21-11 తేడాతో కజుమసా సాకాయ్(జపాన్)పై గెలిచాడు.

మరిన్ని వార్తలు