మన'సైనా' కోరిక తీరనుంది!

17 Sep, 2015 14:49 IST|Sakshi
మన'సైనా' కోరిక తీరనుంది!

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన మనసులోని కోరికను బయటపెట్టింది. బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ కలవాలని ఉందని వెల్లడించింది. షారూఖ్ తాజా చిత్రం 'దిల్ వాలే' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.  ఈవిషయం తెలిసి షారూఖ్ ను కలవాలని ఉందని సైనా ట్వీట్ చేసింది.

'హలో సర్.. మీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోందని తెలిసింది. మిమ్మల్ని కలవాలని ఉంది' అని సైనా ట్వటర్ లో పోస్ట్ చేసింది. దీనికి షారూఖ్ వెంటనే స్పందించారు. తనను కలుసుకోవడానికి సమయం చెప్పాలని సైనాకు సూచించారు. వెంటనే స్పందించిన సైనా శుక్రవారం కలుస్తానని సమాధానం ఇచ్చింది.

షారూఖ్ సరసన నటిస్తున్న కాజోల్ ను ఇప్పటికే కలిసిన సైనా ఆ ఫోటోను ట్విటర్ లో షేర్ చేసింది. కాజోల్ అంటే తనకెంతో ఇష్టమని తెలిపింది. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న 'దిల్ వాలే'లో వరుణ్ ధావన్, కృతి సనన్, బొమన్ ఇరానీ, వినోద్ ఖన్నా, సంజయ్ మిశ్రా, జానీ లివర్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 18న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

మరిన్ని వార్తలు