ఫైనల్లో సైనా నెహ్వాల్‌

26 Jan, 2019 16:23 IST|Sakshi

జకార్తా:  ఇండోనేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ సూపర్‌-500 టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సైమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌ సైనా నెహ్వాల్‌ 18-21, 21-12, 21-18 తేడాతో ఏడో ర్యాంకర్‌ హి బింగ్‌జియావో (చైనా)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించారు. తొలి గేమ్‌ను కోల్పోయిన సైనా.. ఆపై వరుసగా రెండు గేమ్‌లు సత్తా చాటి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు.

ఇరువురి మధ్య కడవరకూ హోరాహోరీగా సాగిన పోరులో సైనానే పైచేయి సాధించారు. సుదీర్ఘమైన ర్యాలీలు, స్మాష్‌లతో సైనా ఆకట్టుకుని బింగ్‌జియావోను ఓడించారు. తొలి గేమ్‌ను సైనా చేజార్చుకున్నప్పటికీ, రెండో గేమ్‌లో విజృంభించి ఆడారు. ఏ దశలోనూ బింగ్‌జియావోకు అవకాశం ఇవ‍్వకుండా సైనా వరుస పాయింట్లతో దుమ్మురేపారు. కాగా, మూడో గేమ్‌ ఆదిలో సైనా ఆధిక్యంలో నిలిచినప్పటికీ, బింగ్‌జియావో తిరిగి పుంజుకున్నారు. దాంతో మ్యాచ్‌ రసవత్తరంగామారింది. కాగా, చివర్లో ఒత్తిడిని అధిగమించిన సైనా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను లాగేసుకున్నారు.

మరిన్ని వార్తలు