శ్రమించి నెగ్గిన సైనా

12 Dec, 2016 15:14 IST|Sakshi
శ్రమించి నెగ్గిన సైనా

ప్రిక్వార్టర్స్‌లోకి కశ్యప్, సారుుప్రణీత్
మకావు ఓపెన్ టోర్నీ

మకావు: గాయం నుంచి కోలుకున్నాక పాల్గొంటున్న మూడో టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్‌ను అతి కష్టమ్మీద అధిగమించింది. మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో ఈ టాప్ సీడ్ క్రీడాకారిణి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సైనా 21-23, 21-14, 21-18తో ప్రపంచ 44వ ర్యాంకర్ హనా రమాదిని (ఇండోనేసియా)పై శ్రమించి గెలిచింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోరుున సైనా... తర్వాతి రెండు గేముల్లో పట్టుదలతో పోరాడి విజయాన్ని దక్కించుకుంది.

మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, భమిడిపాటి సారుుప్రణీత్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్‌లో కశ్యప్ 21-19, 21-8తో చున్ వీ చెన్ (చైనీస్ తైపీ)పై, సారుుప్రణీత్ 21-12, 21-15తో సున్ ఫీజియాంగ్ (చైనా)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 18-21, 13-21తో మొహమ్మద్ బాయు (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో మనూ అత్రి-సుమీత్ రెడ్డి జంట 21-11, 17-21, 21-9తో చాన్ అలన్ యున్ లంగ్-లీ కుయెన్ హాన్ (హాంకాంగ్) జోడీపై గెలిచింది.

 

మరిన్ని వార్తలు