సెయింట్‌ ఫ్రాన్సిస్‌ జట్టుకు టైటిల్‌

20 Mar, 2018 10:44 IST|Sakshi

మహిళల బాస్కెట్‌బాల్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ వైఎంసీఏ ఓపెన్‌ 3–3 మహిళల బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌లో సెయింట్‌ ఫ్రాన్సిస్‌ డిగ్రీ కాలేజి జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో సెయింట్‌ ఫ్రాన్సిస్‌ 18–14తో కేబీసీ జట్టుపై విజయం సాధించింది. విజేత జట్టు తరఫున అమిత డేనియల్‌ 12 పాయింట్లతో చెలరేగింది. కేబీసీ తరఫున రచన (8), మానస (6) ఆకట్టుకున్నారు. అంతకుముందు జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ల్లో కేబీసీ 12–6తో ఫిబాపై, సెయింట్‌ ఫ్రాన్సిస్‌ 16–15తో సెయింట్‌ పాయ్స్‌పై గెలుపొందాయి.

క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో సెయింట్‌ ఫ్రాన్సిస్‌ 17–14తో సెయింట్‌ ప్యాట్రిక్స్‌పై, ఫిబా 13–7తో రాకెట్స్‌పై, సెయింట్‌ పాయ్స్‌ 15–8తో లయోలా అకాడమీపై, కేబీఎస్‌ 17–14తో సెయింట్‌ ఫ్రాన్సిస్‌ జూనియర్‌పై విజయం సాధించాయి. ఫైనల్‌ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్‌ జిల్లా బాస్కెట్‌బాల్‌ సంఘం సంయుక్త కార్యదర్శి ఎస్‌. హనుమంతరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను, నగదు బహుమతిని అందజేశారు. విజేతగా నిలిచిన సెయింట్‌ ఫ్రాన్సిస్‌ జట్టుకు రూ. 3000, రన్నరప్‌ కేబీసీ జట్టుకు రూ. 2000 ప్రైజ్‌మనీగా లభించాయి.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు