సెయింట్‌ జోసెఫ్‌ జట్ల జోరు

11 Aug, 2018 10:16 IST|Sakshi

బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీ రీజినల్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో భాగంగా నిర్వహిస్తోన్న బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌లో సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌ జట్లు జోరు ప్రదర్శిస్తున్నాయి. హబ్సిగూడలోని సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌ వేదికగా శుక్రవారం ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ సెయింట్‌ జోసెఫ్‌ జట్లు విజయం సాధించాయి. జూనియర్‌ బాలుర కేటగిరీ తొలి మ్యాచ్‌లో సెయింట్‌ జోసెఫ్‌ (కింగ్‌కోఠి) 18–6తో సుజాత పబ్లిక్‌ స్కూల్‌పై గెలిచింది. రెండో మ్యాచ్‌లో సెయింట్‌ జోసెఫ్‌ (మలక్‌పేట్‌) 24–12తో ఇండియన్‌ బ్లోసమ్స్‌పై, తర్వాతి మ్యాచ్‌లో సెయింట్‌ జోసెఫ్‌ (మలక్‌పేట్‌) 27–14తో గీతాంజలి (బేగంపేట్‌) జట్లపైన విజయం సాధించాయి.

సీనియర్‌ బాలుర విభాగంలో సెయింట్‌ జోసెఫ్‌ (కింగ్‌కోఠి) 29–3తో హెరిటేజ్‌ వ్యాలీని ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో హెచ్‌పీఎస్‌ (బేగంపేట్‌) 18–11తో సెయింట్‌ జార్జిస్‌ గ్రామర్‌ స్కూల్‌పై, ఫ్యూచర్‌ కిడ్స్‌ 41–26తో జాన్సన్‌ గ్రామర్‌ స్కూల్‌పై విజయం సాధించాయి. ఇతర జూనియర్‌ బాలుర మ్యాచ్‌ల్లో జాన్సన్‌ స్కూల్‌ 67–13తో ఫ్యూచర్‌ కిడ్స్‌ (రాజమండ్రి)పై, లయోలా పబ్లిక్‌ స్కూల్‌ (గుంటూరు) 19–4తో నాసర్‌ స్కూల్‌పై, ఫ్యూచర్‌ కిడ్స్‌ 16–13తో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ (షేక్‌పేట్‌)పై, లిటిల్‌ ఫ్లవర్‌ (గుంటూరు) 16–10తో ఎస్‌డీ నూజివీడుపై గెలుపొందాయి.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు