సింగిల్స్‌ సెమీస్‌లో సాకేత్‌ మైనేని

25 May, 2019 04:55 IST|Sakshi

వోల్వో ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్, భారత డేవిస్‌ కప్‌ జట్టు సభ్యుడు సాకేత్‌ మైనేని సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. జెరూసలేంలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాకేత్‌ 6–4, 6–3తో ఈడన్‌ లెషమ్‌ (ఇజ్రాయెల్‌)పై గెలిచాడు. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్‌ ఐదు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఒకసారి చేజార్చుకున్న సాకేత్, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేశాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో శశికుమార్‌ (భారత్‌) 7–6 (7/2), 6–7 (5/7), 2–6తో ఫిలిప్‌ పెలివో (కెనడా) చేతిలో ఓడిపోయాడు.   

మరిన్ని వార్తలు