టీమిండియా ప్రదర్శనపై ధోని భార్య స్పందన

19 Jan, 2019 10:53 IST|Sakshi

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో అద్భుతమైన ఆటతీరుతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో గెలుచుకొని కోహ్లి బృందం సత్తాను చాటింది. తద్వారా ఆస్ట్రేలియాలో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను తొలిసారి సొంతం చేసుకుని భారత్‌ చరిత్ర సృష్టించింది. మణికట్టు స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ (6/42) అద్భుతమైన ప్రదర్శనతో ఆసీస్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేయగా.. మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని (87 నాటౌట్‌),  మరో ఆటగాడు కేదార్‌ జాదవ్‌ (61నాటౌట్‌)తో కలిసి ఒక్కోపరుగు జతచేస్తూ టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.

చారిత్రక విజయంతో సిరీస్‌ సాధించిన టీమిండియాపై క్రికెట్‌ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా.. ధోని భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో టీమిండియా ఆటగాళ్లను అభినందించారు. ‘సైనికుల మాదిరి కష్టించి పనిచేసి భారత్‌కు చారిత్రాత్మక విజయాన్నిఅందించారు. మీ అందరికీ అభినందనలు. దేశం తలెత్తుకునేలా చేశారు’ అని పేర్కొన్నారు.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రే లియా 48.4 ఓవర్లలో 230 పరుగులకే ఆలౌట్‌ కాగా అనంతరం భారత్‌ 49.2 ఓవర్లలో 3 వికెట్లకు 234 పరుగులు చేసి గెలిచింది. 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ధోని (114 బంతుల్లో 87 నాటౌట్‌; 6 ఫోర్లు), కేదార్‌ జాదవ్‌ (57 బంతుల్లో 61 నాటౌట్‌; 7 ఫోర్లు) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 121 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. కోహ్లి (62 బంతుల్లో 46; 3 ఫోర్లు) మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. సిరీస్‌లో ధోని మొత్తం 193 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ పురస్కారం అందుకున్నాడు. 

Historical victory by @indiancricketteam .Huge Congratulations!! You guys have made country proud! Fought like a soldier long and hard 🔥👏🏻❤️ @mahi7781 🇮🇳 Sweet Victory !

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

(మిషన్‌ ఆసీస్‌ దిగ్విజయం)

మరిన్ని వార్తలు