సాక్షి మళ్లీ శిబిరానికి.... 

20 Aug, 2019 06:40 IST|Sakshi

సంతృప్తికర వివరణతో ఓకే అన్న డబ్ల్యూఎఫ్‌ఐ  

న్యూఢిల్లీ: జాతీయ శిక్షణ శిబిరంలో తిరిగి చేరేందుకు భారత మహిళా స్టార్‌ రెజ్లర్‌ సాక్షి మలిక్‌కు భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అనుమతించింది. సమాచారం ఇవ్వ కుండా  శిబిరం నుంచి నిష్క్రమించడంతో మొదట ఆగ్రహించిన సమాఖ్య వివరణ ఇవ్వాలని ఆమెకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.  మొత్తం 25 మంది మాట మాత్రమైనా చెప్పకుండా, సంబంధిత వర్గాల అనుమతి లేకుండానే శిబిరం నుంచి జారుకున్నారు. ఇందులో 2016 రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి (62 కేజీలు)తో పాటు సీమా (50 కేజీలు), కిరణ్‌ (76 కేజీలు) ఉన్నారు. ఈ ముగ్గురు ఇటీవలే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సంపాదించారు. బుధవారం లోగా వివరణ ఇవ్వాలని  డబ్ల్యూఎఫ్‌ఐ ఆదేశించగా సాక్షి... రక్షాబంధన్‌ వేడుకలో పాల్గొనేందుకే శిబిరం నుంచి పయనమైనట్లు వివరించింది. దీనిపై డబ్ల్యూఎఫ్‌ఐ ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేయడంతో ఆమె తిరిగి శిబిరంలో కొనసాగేందుకు అనుమతిచ్చారు.

మరిన్ని వార్తలు