ధోని రిటైర్మెంట్‌పై సాక్షి ట్వీట్‌.. డిలీట్‌

28 May, 2020 08:42 IST|Sakshi

ముంబై: టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోని రిటైర్మెంట్‌పై చర్చ మరోసారి పతాక స్థాయికి చేరుకుంది. ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌-2019 అనంతరం ధోని ఇప్పటివరకు టీమిండియా జెర్సీ ధరించలేదు. దీంతో అప్పటినుంచి ఈ జార్ఖండ్‌ డైనమెట్‌ రిటైర్మెంట్‌పై చర్చ ప్రారంభమైంది. ఐపీఎల్‌లో అతడి ప్రదర్శన ఆధారంగా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ టోర్నీ వాయిదా పడుతూ వస్తోంది. అయితే బుధవారం ధోని రిటైర్మెంట్‌ తీసుకున్నాడనే వార్త సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేసింది. అంతేకాకుండా #dhoniretire అనే హ్యాష్‌ ట్యాగ్‌ కూడా ట్విటర్‌లో తెగ ట్రెండ్‌ అయింది. దీంతో అతడి అభిమానులు గందరగోళానికి గురయ్యారు. 

అయితే ఈ వార్తలను ధోని సతీమణి సాక్షి సింగ్‌ రావత్‌తో పాటు అతడి సన్నిహితులు కొట్టిపారేశారు. ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్‌పై సాక్షి చేసిన ట్వీట్‌ వివాదస్పదమైంది. ‘అవన్నీ పుకార్లు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజల మానసిక స్థితి దెబ్బతిన్నది అని నాకు అర్ధమవుతుంది’ అంటూ ట్వీట్‌ చేశారు. దీనిపై పలువురు అభ్యంతరం తెలపడంతో వెంటనే ఆ ట్వీట్‌ను సాక్షి తొలగించారు. అయితే అప్పటికే ఆ ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అయింది. గతంలో ధోని రిటైర్మెంట్‌పై సాక్షి కూల్‌గానే సమాధానమిచ్చారని, తరుచూ ఇలాంటి వార్తలు వస్తుండటంతో పూర్తిగా సహనం కోల్పోయి కోపంలో అలా ట్వీట్‌ చేశారని ధోని కుటుంబ సన్నిహితులు పేర్కొంటున్నారు. 

చదవండి:
దడదడలాడించిన చమిందా వాస్‌
'ధోని ప్లాన్‌ మాకు కప్పును తెచ్చిపెట్టింది'

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా