సాక్షి ధోని బర్త్‌డే.. విష్‌ చేసిన హార్దిక్‌

20 Nov, 2019 14:30 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని సతీమణి సాక్షి ధోని మంగళవారం తన 31వ జన్మదిన వేడుకలను రాంచీలో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకుకు అతికొద్ది మందిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ధోని ఇంట ఏ వేడుకైనా హాజరయ్యే టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాతో పాటు రాబిన్‌ ఊతప్ప ఆయన భార్య శీతల్‌ గౌతమ్‌ తదితరులు సాక్షి ధోని బర్త్‌డే వేడుకల్లో పాల్గొని​ ఆమెకు విషెస్‌ తెలిపినట్లు సమాచారం . ఇక సాక్షి ధోనికి హార్దిక్ పాండ్యా, శీతల్‌ గౌతమ్‌లు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఇక భర్త ధోని, కూతురు జీవాతో కలిసి బర్త్‌డే వేడుకలు జరుపుకున్న ఫోటోను సాక్షి తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌ అవుతోంది. అంతేకాకుండా సాక్షి ధోనికి నెటిజన్లు బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు. 

ఇక ధోని కుటుంబం టీమిండియా సభ్యులతో సరదాగా ఉంటుందన్న విషయం తెలిసిందే. సోషల్‌ మీడియాలో భారత క్రికెటర్లు చేసిన పోస్ట్‌లకు సాక్షి ఫన్నీ రిప్లై ఇస్తుంటుంది. గతంలో ధోనిని, జీవాను తెగ మిస్‌ అవుతున్నట్లు హార్దిక్‌ ట్వీట్‌ చేశాడు. దీనికి సమాధానంగా ‘హార్దిక్‌ నీకు తెలుసా..రాంచీలో నీకు ఇల్లు ఉంది’అంటూ సాక్షి ధోని రిట్వీట్‌ చేశారు. ఇక ప్రపంచకప్‌ ముగిసిన అనంతరం ధోని తాత్కాలిక విరామం ప్రకటించాడు. దీంతో వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా తాజాగా బంగ్లాదేశ్‌ సిరీస్‌కు ధోని దూరమయ్యాడు. మరోవైపు వెన్నులో గాయం కారణంగా లండన్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్న హార్దిక్‌ పాండ్యా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.
 

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు