స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాను..క్షమించండి: భట్

28 Jun, 2013 22:40 IST|Sakshi
స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాను..క్షమించండి: భట్
2010 సంవత్సరంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో తాను స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు మాజీ పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ సల్మాన్ భట్ తొలిసారి అంగీకరించాడు. అయితే తాను స్పాట్ ఫిక్సింగ్ పాల్పడినందుకు క్షమించాలని అభిమానులను కోరాడు. 2010 లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ మ్యాచ్ లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలో భట్, మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ ఆమీర్ లపై ఐసీసీ నిషేధం విధించింది.
 
నిషేధ కాలాన్ని తగ్గించాలని కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ముందు కోరే అవకాశాన్ని భట్ తోపాటు ఆసిఫ్, ఆమీర్ లు కోల్పోయారు. అయితే వీరిని అవినీతి నిరోధక, సెక్యూరిటీ యూనిట్ కు సహకరించాలని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ కోరారు. ఐసీసీ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని గౌరవిస్తానని..స్పాట్ ఫిక్సింగ్ పాల్పడిన తనను మన్నించాలని ఓ ప్రకటనలో భట్ వెల్లడించారు.
 
క్రికెట్ ను కెరీర్ ఎంచుకోవాలనుకునే వారికి అలాంటి తప్పులకు పాల్పడవద్దని భట్ కోరారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఐదేళ్ల నిషేధానికి గురై.. ఇంగ్లాండ్ లో శిక్ష అనుభవించిన భట్ కు ఇంకా రెండేళ్ల నిషేధం మిగిలి ఉంది. అయితే దేశవాలీ క్రికెట్ ను ఆడటానికి ఐసీసీ అనుమతించాలని.. నిషేధం ముగిసే సమయానికి జాతీయ జట్టుకు అందుబాటులో ఉంటానని భట్ ఐసీసీని కోరాడు. 
మరిన్ని వార్తలు