‘ధోని.. అయామ్‌ ఈగర్లీ వెయిటింగ్‌’

15 Apr, 2020 11:45 IST|Sakshi

హైదరాబాద్‌: ఎంఎస్‌ ధోని సారథ్యంలో ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెన్నై సూపర్‌కింగ్స్‌(సీఎస్‌కే) కొత్త బౌలర్‌ సామ్‌ కరన్‌ తెలిపాడు. డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో ఈ ఇంగ్లండ్‌ బౌలర్‌ను సీఎస్‌కే ఐదున్నర కోట్లకు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. గతేడాది కింగ్స్‌ పంజాబ్‌ తరుపున ప్రాతినిథ్యం వహించిన కరన్‌ హ్యాట్రిక్‌తో పాటు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. అయితే కరోనా కారణంగా ఐపీఎల్‌-2020 వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇన్‌స్టాలో సీఎస్‌కేతో లైవ్‌చాట్‌లో పాల్గొన్న కరన్‌.. ధోని, సీఎస్‌కే జట్టుపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. 

‘ఐపీఎల్‌ ఆడటం ప్రతీ ఒక్క క్రికెటర్‌కు ఒక రకమైన అనుభూతిని కలిగిస్తుంది. అందులో దిగ్గజ క్రికెటర్లు ఎక్కువగా ఉన్న సీఎస్‌కే ఫ్రాంచైజీ తరుపున ఆడాలని ప్రతీ ఒక్క ఆటగాడికి ఓ కల. అలాంటి అవకాశం నాకు దక్కింది. స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ వంటి కోచ్‌, వరల్డ్‌ బెస్ట్‌ కెప్టెన్‌ ధోని నాయకత్వంలో ఆడటం ఆటగాడిగా నాకు ఎంతో లాభం చేకూరుతుంది. ధోని సారథ్యంలో ఆడేందుకు నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఆయన కెప్టెన్సీలో ఎన్నో మెళకువలు నేర్చుకోవచ్చనే ఓ చిన్న స్వార్థం నాలో ఉంది. ధోని, మా దేశ ఆటగాడు బిల్లింగ్స్‌తో పాటు దిగ్గజ క్రికెటర్లతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకోవడం అనేది అద్భుత అవకాశంగా భావిస్తున్నాను. 

ఈ మధ్యనే నన్ను సీఎస్‌కే వాట్సాప్‌ గ్రూప్‌లో చేర్చారు. అందరూ ఎంతో ప్రేమగా స్వాగతం పలికారు. కొద్ది రోజల క్రితం జరిగిన సీఎస్‌కే ట్రైనింగ్‌ సెషన్‌లో పాల్గొనాల్సింది. కానీ టెస్టు సిరీస్‌ సందర్భంగా జట్టుతో కలవలేకపోయాను. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పటికీ చై​న్నైలో ఉండేవాడిని. కానీ పరిస్థితలు చాలా వేగంగా మారాయి. అయితే ప్రస్తుతం సయమం ఎంతో భయంకరంగా ఉంది. ఓపికతో వ్యవహరించాలి. ఈ పరిస్థితుల నుంచి త్వరగా గట్టెక్కితే ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యపడుతుంది’అని కరన్‌ పేర్కొన్నాడు.

చదవండి:     
ప్రియాంక, కరీనా ఇష్టం.. స్టెయిన్‌ కష్టం
నాడు రియల్.. నేడు వైరల్‌

మరిన్ని వార్తలు