భారత్‌ టాపార్డర్‌ను కుర్రాన్‌ కూల్చేశాడు

2 Aug, 2018 19:12 IST|Sakshi
వికెట్లు తీసిన ఆనందంలో కుర్రాన్‌

బర్మింగ్‌హామ్‌ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 100 పరుగులకే భారత్‌ 5 ప్రధాన వికెట్లు కోల్పోయింది. అయితే తొలుత 9 ఓవర్లలోనే 40 పరుగులు చేసి ఓపెనర్లు విజయ్‌, ధావన్‌ దాటిగా ఆడే యత్నం చేశారు.  50/0 గా ఉన్న భారత్‌.. ఇంగ్లండ్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ స్యామ్‌ కుర్రాన్‌ దాటికి  కేవలం 9 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో పరిస్థితి 59/3గా మారింది. ఇన్నింగ్స్‌ 14వ ఓవర్ 4వ బంతిని విజయ్‌ డిఫెన్స్‌ ఆడగా ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌ చేశారు. అంపైర్‌ నాటౌట్‌ ఇవ్వడంతో జో రూట్‌ రివ్యూకు వెళ్లాడు. బంతి లెగ్‌ స్టంప్‌ను గిరాటేస్తున్నట్లుగా కనిపించగా విజయ్‌ (20) నిరాశగా వెనుదిరిగాడు. ఆపై క్రీజులోకి వచ్చిన కేఎల్‌ రాహుల్‌ తాను ఎదుర్కొన్న తొలి బంతిని ఫోర్‌గా మలిచి, రెండో బంతికి బౌల్డ్‌ అయ్యాడు. బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ను పడగొట్టింది. దీంతో ఒకే ఓవర్లో 2 ప్రధాన వికెట్లు తీసిన కుర్రాన్‌.. తన మరుసటి ఓవర్ (16వ) ఆడిన ధావన్‌ ఇబ్బంది పడ్డాడు. 

ఇదే క్రమంలో ఆ ఓవర్లో 5వ బంతిని ఆడగా సెకండ్‌ స్లిప్‌లో ఉన్న మలాన్‌ చేతుల్లో పడింది. ధావన్‌(26) వికెట్‌ను సైతం కుర్రాన్‌ తన ఖాతాలో వేసుకుని భారత్‌ను ఒక్కసారిగా దెబ్బతీశాడు. ఆపై అజింక్య రహానే(15)తో కలిసి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇన్నింగ్స్‌ను నిర్మించే యత్నం చేశాడు. అయితే కెప్టెన్‌ రూట్‌ నమ్మకాన్ని బెన్‌స్టోక్స్‌ నెలబెట్టాడు. స్టోక్స్‌ వేసిన 28వ ఓవర్‌ నాలుగో బంతికి రహానే ఔటయ్యాడు. రహానే ఆడిన బంతిని జెన్నింగ్స్‌ క్యాచ్‌ పట్టడంతో నాలుగో వికెట్‌ కోల్పోయిన కోహ్లీ సేన స్కోరు 100 వద్దే స్టోక్స్‌ బౌలింగ్‌లో దినేష్‌ కార్తీక్‌ బౌల్డయి డకౌట్‌ అయ్యాడు.

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా ఇంగ్లండ్‌ తన మొదటి ఇన‍్నింగ్స్‌లో 287 పరుగుల వద్ద ఆలౌటైంది. 285/9 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం రెండో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లండ్‌ మరో రెండు పరుగులు మాత్రమే జత చేసి చివరి వికెట్‌ను కోల్పోయింది.

మరిన్ని వార్తలు