26 ఫోర్లతో డబుల్‌ సెంచరీ

18 Feb, 2020 20:58 IST|Sakshi
సమిత్‌ ద్రవిడ్‌ (ఏఎన్‌ఐ ఫొటో)

బెంగళూరు: టీమిండియా వాల్‌, దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వారసుడు సమిత్‌ ద్రవిడ్‌ తండ్రిదగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. రెండు నెలల వ్యవధిలో రెండో డబుల్‌ సెంచరీ సాధించి సత్తా చాటాడు. తన స్కూల్‌ మాల్యా అదితి ఇంటర్నేషనల్‌(ఎంఏఐ) తరపున బరిలోకి బ్యాట్‌ ఝళిపించాడు. బీటీఆర్‌ షీల్డ్‌ అండర్‌-14 గ్రూప్‌ వన్‌ డివిజన్‌ 2 టోర్నమెంట్‌లో ద్విశతకంతో జూనియర్‌ ద్రవిడ్‌ చెలరేగాడు. కేవలం 144 బంతుల్లోనే 26 ఫోర్లు, సిక్సర్‌తో 211 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. సమిత్‌ విజృంభణతో ఎంఏఐ టీమ్‌ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 386 పరుగులు భారీ స్కోరు చేసింది. ఎంఏఐతో పోటీ పడిన బీజీఎస్‌ నేషనల్‌ పబ్లిక్‌ స్కూల్‌ జట్టు వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి 132 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది.

క్రికెట్‌లో సత్తా చాటడం సమిత్‌ ద్రవిడ్‌ కొత్త కాదు. అండర్‌-14 ఇంటర్‌ జోనల్‌ టోర్నమెంట్‌లో భాగంగా గతేడాది డిసెంబర్‌ 20న జరిగిన మ్యాచ్‌లో వైస్‌ ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ జట్టు తరపున బరిలోకి సమిత్‌ డబుల్‌ సెంచరీ(201)తో మోత మోగించాడు. అండర్‌-12 విభాగంలో 2015లో జరిగిన టోర్నమెంట్‌లో మూడు అర్ధసెంచరీలు బాదడంతో సమిత్‌ పతాక శీర్షికలకు ఎక్కాడు. అప్పటి నుంచి స్థిరంగా రాణిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకుంటున్నాడు. (చదవండి: సచిన్‌ను గంగూలీ వదలట్లేదుగా!)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా