సెమీస్‌లో సానియా జంట

7 Jan, 2016 01:56 IST|Sakshi
సెమీస్‌లో సానియా జంట

 బ్రిస్బేన్: గతేడాది పది డబుల్స్ టైటిల్స్ నెగ్గి సంచలనం సృష్టించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... కొత్త ఏడాదిలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. తన భాగస్వామి మార్టినా హింగిస్‌తో కలిసి ఈ హైదరాబాద్ అమ్మాయి బ్రిస్బేన్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 6-3, 4-6, 10-6తో బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్)-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) ద్వయంపై విజయం సాధించింది. అంతకుముందు తొలి రౌండ్‌లో సానియా-హింగిస్ 6-1, 6-2తో షహర్ పీర్ (ఇజ్రాయెల్)- శాంచెజ్ (అమెరికా)లపై గెలిచారు.
 

మరిన్ని వార్తలు