రెండోరౌండ్ లో సానియా జోడి

22 Jan, 2016 00:58 IST|Sakshi
రెండోరౌండ్ లో సానియా జోడి

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో భారత స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)ల జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. గురువారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్‌లో టాప్‌సీడ్ సానియా ద్వయం 6-2, 6-3తో మరియానో మారినో (కొలంబియా)-టెలియానా పెరీరా (బ్రెజిల్)లపై గెలిచి రెండోరౌండ్‌లోకి ప్రవేశించింది. దీంతో సానియా-హింగిస్ వరుసగా 31వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు.

 70 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో-స్విస్ జంటకు ప్రత్యర్థుల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. పురుషుల డబుల్స్ తొలిరౌండ్‌లో నాలుగోసీడ్ రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జా (రొమేనియా) 7-5, 6-3తో ఒమర్ జాసికా-నిక్ కిర్గియోస్ (ఆస్ట్రేలియా)పై నెగ్గి తదుపరి రౌండ్‌లోకి అడుగుపెట్టారు.

మరిన్ని వార్తలు