జనం చస్తుంటే ఈ వంటావార్పులేంటి: సానియా

5 Apr, 2020 05:11 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో జనం చస్తుంటే... చాలా మంది ఆకలితో అలమటిస్తుంటే సెలబ్రిటీలు వంటావార్పుల వీడియోలతో లాక్‌డౌన్‌ను పాటిస్తున్నట్లు షేర్‌ చేయడాన్ని టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తీవ్రంగా తప్పుబట్టింది. ట్విట్టర్‌ వేదికగా ఆమె ‘మన వంట వీడియోలు, రుచుల ఫొటోల పోస్టింగ్‌ పూర్తయ్యిందా లేదా’ అని ఘాటుగా స్పందించింది. ‘ఒక్కసారి ఆలోచిం చండి... మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా మన చుట్టూ ఉన్న జనంలో వేలసంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. లక్షలాది మంది ఒక పూట తిండి దొరకడమే అదృష్టంగా భావిస్తున్నారు. ఇలాంటి సంక్షోభంలో అలాంటి వీడియోలు షేర్‌ చేయడమేంటి’ అని సానియా అసహనం వ్యక్తం చేసింది. శుక్రవారం ప్రధాని మోదీ 49 మంది భారత  క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో కరోనాను జయించేందుకు వారి సూచనలు, సలహాలు కోరిన సంగతి తెలిసిందే. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు