బాబాయ్‌ ఫోర్‌ కొడితే.. బాబా సిక్సర్‌ బాదుతాడు

28 Jun, 2020 16:14 IST|Sakshi

లాక్‌డౌన్‌లో భాగంగా పలువురు క్రీడా ప్రముఖులు ఇంటికే పరిమితమైనప్పటికీ సోషల్‌ మీడియా వేదికగా తమ అభిమానులకు చేరువవుతున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సానియా మీర్జా తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా సానియా తన కుమారుడు ఇజాన్‌ మీర్జా మాలిక్‌తో కలిసి సరదాగా చేసిన ఓ సంభాషణకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ‘బాబాయ్ ‌(అసద్‌) 4 బౌండరీ కొడితే.. బాబా (షోయబ్‌ మాలిక్‌) సిక్సర్‌ కొడతారు’ అని సానియా కామెంట్‌ జతచేశారు. (‘ఆ పది మంది’ లేకుండా...)

ఇక ఈ సంభాషణలో.. సానియా తన కుమారుడితో మాట్లాడుతూ.. కుక్క ఎలా అరుస్తుంది బేబీ అని అడిగితే.. చిన్నారి ఇజాన్‌ బౌబౌ అంటూ డాగ్‌లా అనుకరిస్తూ సమాధానం ఇస్తాడు. ఇక అసద్‌ బాబాయ్‌ (అసద్‌‌) ఏం చేస్తారని అడుగుతూనే.. అసద్‌ ఫోర్‌ కొడతారని బదులు ఇస్తారు సానియా. అదే విధంగా బాబా (మాలిక్‌) ఏం చేస్తారని అడుగుతూ.. బాబా సిక్సర్‌ బాదుతారని తన కూమారుడితో సానియా సరదాగా సంభాషిస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లతో పాటు పలువురు క్రీడా ప్రముఖలు లైక్‌ చేస్తున్నారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో ఇప్పటికే 1.7 లక్షల మంది లైక్‌ చేశారు. అక్టోబర్‌ 30, 2018న సానియా ఇజాన్‌ మీర్జా మాలిక్‌కు‌ జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

Asad khaalu hits a 4 but Baba hits a 6 😏 he might be a bit biased 💕 🤣@izhaan.mirzamalik #Myizzy

A post shared by Sania Mirza (@mirzasaniar) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు