సానియా అప్పుడు.. ఇప్పుడు.. 

10 Feb, 2020 16:19 IST|Sakshi

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తల్లి అయ్యాక ఆడిన తొలి టోర్నమెంట్‌లోనే టైటిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గర్భిణిగా ఉన్నప్పుడు సానియా బొద్దుగా తయారయ్యారు. ఆ సమయంలో ఆమె బరువు 89 కిలోలకు చేరింది. అయితే తిరిగి టెన్నిస్‌ ఫీల్డ్‌లో దిగేందుకు సానియా తీవ్రంగా శ్రమించారు. తిరిగి ఫిటినెస్‌ సాధించడానికి కఠోర సాధన చేశారు.  4 నెలల కాలంలోనే 26 కిలోల బరువు తగ్గి ఫిట్‌గా తయారయ్యారు. తాజాగా తన ఫిట్‌నెస్‌కు సంబంధించి సానియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ప్రతి ఒక్కరికీ లక్ష్యాలు ఉంటాయని పేర్కొన్న సానియా.. వాటిని గర్వకారణంగా నిలిపేందుకు కృషి చేయాలన్నారు. మన కలలను సాకారం చేసేందుకు యత్నిస్తుంటే ఎంతో మంది నిరాశకు గురిచేస్తారని.. కానీ వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 

‘89 కిలోలు వర్సెస్‌ 63 కిలోలు. ప్రతి ఒక్కరికి లక్ష్యాలు ఉంటాయి. రోజువారి లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏవైనా..  ప్రతిదానిని గర్వకారణంలా నిలిపేందుకు శ్రమించాలి. తల్లి అయ్యాక తిరిగి ఫిట్‌గా, ఆరోగ్యంగా కావాలనే నా లక్ష్యాన్ని సాధించడానికి 4 నెలల సమయం పట్టింది. తిరిగి ఫిట్‌నెస్‌ పొందడానికి, అత్యుత్తమ స్థాయిలో రాణించడానికి ఎంతో సమయం పట్టిందని అనిపిస్తోంది. మీ కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని నిరాశకు గురిచేసేవారు ఎంతో మంది ఉంటారు. కానీ నేను ఇది చేయగలను అనుకుంటే దానిని తప్పకుండా సాధిస్తారు’ అని సానియా పేర్కొన్నారు. సానియా ఈ పోస్ట్‌ చేసిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు సానియాను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆమె చాలా మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడుతున్నారు.

89 kilos vs 63 🙃 we all have goals.. everyday goals and long term goals .. take pride in each one of those .. it took me 4 months to achieve this goal of mine, to get back to being healthy and fit after having a baby .. feels like such a long way.to come back and regain fitness and being able to compete at the highest level again .. Follow your dreams.No matter how many ppl tell you , you can’t 😉 cause God knows how many of those we have around us 🙄😅If I can then anyone can 🙏🏽 #believe #mummahustles

A post shared by Sania Mirza (@mirzasaniar) on

చదవండి : శభాష్‌ సానియా 

ఫెడ్‌ కప్‌కూ సానియా దూరం! 

మరిన్ని వార్తలు