Advertisement

సానియా రిటైర్డ్‌ హర్ట్‌

23 Jan, 2020 15:30 IST|Sakshi

మెల్‌బోర్న్‌:  దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగి తొలి టోర్నీలో టైటిల్ నెగ్గి తన రీఎంట్రీని ఘనంగా చాటుకున్న భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. ఆస్ట్రేలియా ఓపెన్‌ ఆరంభంలోనే తన పోరును ముగించారు. కాలిపిక్క గాయంతో ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడకుండానే తప్పుకున్నారు. ఉక్రెయిన్ పార్టనర్ నదియా కిచెనోక్‌తో కలిసి ఇటీవలే హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్ నెగ్గిన హైదరాబాద్ టెన్నిస్ స్టార్.. కాలి పిక్కగాయంతో సతమతమైంది. దీంతోనే మెగా టోర్నీనుంచి అర్ధాంతరంగా నిష్క్రమించింది.

తొలుత మిక్స్‌డ్ డబుల్స్ టోర్నీ నుంచి తప్పుకున్న సానియా.. గురువారం జిన్‌యున్‌ హాన్‌-లిన్‌ జు (చైనా) జోడీతో జరిగాల్సిన మహిళల డబుల్స్ మ్యాచ్ మధ్యలో వైదొలిగారు. ఈ మ్యాచ్‌లో సానియా-నదియా 2-6తో తొలి సెట్ కోల్పోయింది. అనంతరం రెండో సెట్‌లో ఫస్ట్ గేమ్ ఓడి 0-1 వెనుకంజలో ఉండగా సానియా గాయం ఇబ్బంది పెట్టింది. దీంతో ఆమె రిటైర్ట్ హర్ట్‌గా వైదొలిగారు. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ బోపన్నతో కలిసి సానియా ఆడాల్సి ఉండగా తప్పుకున్నారు.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోహ్లి.. అంత ఈజీ కాదు!

ఆరుగురు బౌలర్ల వ్యూహం.. శాంసన్‌, పంత్‌ డౌటే? 

‘ఇప్పుడే ఐపీఎల్‌లో ఆడటం అవసరమా?’

అరటిపండు తొక్క తీసివ్వు..

అతనొక స్మార్ట్‌ క్రికెటర్‌: విరాట్‌ కోహ్లి

సినిమా

పెళ్లి ఎప్పుడో చెప్పేసిన నటి.. 

అందుకే ఇప్పట్లో పెళ్లి చేసుకోలేం: నటి

అందుకే ఆస్పత్రిలో చేరా: సునీల్‌

‘ఆమెను నిర్భయ దోషులతో కలిపి ఉంచాలి’

అల్లు అర్జున్‌ కుటుంబంలో విషాదం

పరిచయమైన కొత్తలో భయం ఉండేది..