మా తొలి పరిచయం అలా: సానియా మీర్జా

8 Dec, 2019 01:06 IST|Sakshi

షోయబ్‌తో పరిచయాన్ని గుర్తు చేసుకున్న సానియా మీర్జా  

న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా పెళ్లి అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్‌ మాలిక్‌తో ఆమె ప్రేమ, పెళ్లి అప్పట్లో రెండు దేశాల్లో చర్చనీయాంశమైంది. అయితే తాజాగా శనివారం జరిగిన ఇండియా టుడే ఇన్‌స్పిరేషన్‌ కార్యక్రమంలో షోయబ్‌తో తన తొలి పరిచయం గురించి సానియా మీర్జా గుర్తు చేసుకుంది. ఆ్రస్టేలియాలోని హోబర్ట్‌లోని ఒక రెస్టారెంట్‌లో తొలిసారి షోయబ్‌ను కలిశానని చెప్పుకొచ్చింది. ‘క్రీడాకారులుగా మేమిద్దరం ఒకరికొకరం తెలుసు.

కానీ తొలిసారి షోయబ్‌ను హోబర్ట్‌లోని ఒక రెస్టారెంట్‌లో సాయంత్రం 6 గంటల సమయంలో కలిశాను. అప్పుడు అక్కడ ఎవరూ లేరు. మా ఇద్దరినీ విధి కలిపిందని అప్పట్లో నేను గట్టిగా నమ్మేదాన్ని. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే నేను అక్కడ ఉన్నానని తెలుసుకొని షోయబ్‌ ప్రణాళిక ప్రకారం నా దగ్గరికి వచ్చారు. ఇదంతా అతని ప్లాన్‌ అని ఆలస్యంగా తెలుసుకున్నా’ అంటూ సానియా నవ్వులు చిందించింది. 2010 ఏప్రిల్‌ 12న హైదరాబాద్‌లో సానియా, షోయబ్‌ మాలిక్‌ వివాహం జరిగింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు