'నా బయోపిక్ సాధ్యం కాకపోవచ్చు'

6 Nov, 2016 14:30 IST|Sakshi
'నా బయోపిక్ సాధ్యం కాకపోవచ్చు'

న్యూఢిల్లీ: ఇప్పటికే పలువురు క్రీడాకారుల జీవిత కథలను బయోపిక్లుగా తెరకెక్కించిన నేపథ్యంలో టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా జీవితంపై సినిమా రూపొందవచ్చనే ఊహాగానాలు వినిపించాయి. అయితే తన బయోపిక్ను తీయడం సాధ్యం కాకపోవచ్చని సానియా తాజాగా పేర్కొంది. తన జీవిత కథను తెరకెక్కించడానికి పలువురు  తనను కలిసినా, దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు సానియా వెల్లడించింది. ఈ మేరకు హిందుస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్య్వూలో సానియా పలు విషయాలను వ్యక్తీకరించింది.

'నా జీవిత కథను తీయడానికి కొంతమంది నన్ను కలిసిన మాట వాస్తవమే. వారికి నేను ఒకటే చెప్పా. బయోపిక్ తీయాలంటే చాలా విస్తృతమైన పని. నా జీవితం గురించి ప్రతీ విషయం బయోపిక్ రూపంలోకి తేవాలి. అది కొంచెం కష్టమే. అందుచేత నా బయోపిక్పై ఆసక్తిగా లేను' అని సానియా పేర్కొంది. ఈ ఏడాది మహిళల డబుల్స్ టెన్నిస్ ర్యాంకింగ్స్ను నంబర్ వన్ గా ముగించిన సానియా.. తాను ఎదుర్కొన్న పలు పరాజయాలు మరింత బలంగా తయారుకావడానికి దోహదం చేసినట్లు తెలిపింది. ఒలింపిక్స్ లో పతకం సాధించే అవకాశం తన వరకూ వచ్చిన దాన్ని అందుకోలేనందుకు చాలా బాధగా ఉందని సానియా స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు