టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఇంట పెళ్లి సందడి

12 Dec, 2019 17:41 IST|Sakshi

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా వివాహాం బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. మాజీ  టీమిండియా కెప్టెన్‌, హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ తనయుడు అసద్‌తో ఆనం వివాహాం బుధవారం జరిగింది. ప్రస్తుతం  ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వంకాయ రంగు లెహెంగా ధరించిన ఆనం పక్కనే అసద్‌ బంగారు రంగు షెర్వానీ ధరించి నిలుచుని ఉన్న ఫోటోలను ఆనం తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. వారిద్దరు కలసి ఉన్న చిత్రానికి ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌’ అంటూ హ్యష్‌ ట్యాగ్‌ను జత చేసి పోస్ట్‌ చేశారు ఆనం మీర్జా.

Mr and Mrs 🥳 #alhamdulillahforeverything #AbBasAnamHi 📷 @weddingsbykishor @daaemi

A post shared by Anam Mirza (@anammirzaaa) on

ఇక ఆనం షేర్‌ చేసిన తన వివాహ వేడుక ఫోటోలు ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ కొత్త జంటను చూసి నెటిజన్లంతా ఫిదా అవుతూ ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అని ఇక పెళ్లి కూతురు డ్రెస్‌లో ఉన్న ఆనంను చూసి ‘చాలా అందంగా ఉంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే సానియా తన సోదరి మెహందీ, ప్రీ వెడ్డింగ్‌ వేడుక ఫోటోలను కూడా తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. మెహం​దీ‍ వేడుకలో సానియా నల్లటి, ఎరుపు రంగు దుస్తులను ధరించగా.. ఆమె సోదరి కలర్‌ ఫుల్‌ లెహెంగాలో కలిసి దిగిన ఫోటోలో వారిద్దరు అదంగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు