హల్‌చల్‌ చేస్తోన్న సానియా ఫోటోలు

19 Sep, 2019 18:50 IST|Sakshi

భారత టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మీర్జా పారిస్‌ వీధుల్లో విహరిస్తున్నారు. తన చెల్లి ఆనమ్‌ మీర్జా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆనమ్‌ మీర్జా బ్యాచిలర్‌ పార్టీని పారిస్‌లో ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ బ్యాచిలర్‌ పార్టీలో సానియా మీర్జా హైలెట్‌గా నిలిచారు. పారిస్‌ వీధుల్లో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో సానియా పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం సానియా ఫోటోలు నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. అంతేకాకుండా ఆ ఫోటోలపై నెటిజన్లు సరదా కామెంట్స్‌ చేస్తున్నారు. ‘ఓ బిడ్డకు తల్లి అయినా మోడల్‌కు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నావ్‌’, ‘సానియా ఆటకు, యాటిట్యూడ్‌కు పెద్ద ఫ్యాన్‌’, అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

ఇక గతకొద్ది రోజుల క్రితమే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆనమ్‌ మీర్జా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. టీమిండియా మాజీ సారథి అజారుద్దీన్‌ కొడుకు అసదుద్దీన్‌ను ఆనమ్‌ వివాహం చేసుకోబోతోందని అనేక వార్తలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. దీంతో ఆనమ్‌కు కాబోయే భర్త అసదుద్దీనే అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే వీరిద్దరూ ఈ వార్తలపై ఇప్పటివరకూ స్పందించలేదు. అయితే ఆనమ్‌కు 2015లో హైదరాబాద్‌కే చెందిన ఓ బిజినెస్‌మన్‌తో వివాహమైంది. అయితే వీర్దిదరి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు