యువీని ట్రోల్‌ చేసిన సానియా

29 Sep, 2019 12:59 IST|Sakshi
యువరాజ్‌ సింగ్‌-సానియా మీర్జా(ఫైల్‌ఫొటో)

న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ వరుసగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత భారత్‌ క్రికెట్‌ జట్టు గురించి ఆసక్తికర కామెంట్లు చేయడంతో పాటు తాను ఎందుకు క్రికెట్‌ వీడ్కోలు పలకాల్సి వచ్చిందనే విషయాన్ని గత కొన్ని రోజులుగా అభిమానులతో షేర్‌ చేసుకుంటూనే ఉన్నాడు యువీ. తాజాగా యువీ పోస్ట్‌ చేసిన ఒక ఫోటో వైరల్‌గా మారింది.  క్లీన్‌ షేవ్‌తో  కొత్త లుక్‌లో ఉన్న ఫోటోను యువీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.  దీనికి ‘చిక్నా చమేలా’ లుక్‌ ఎలా ఉందంటూ కింద క్యాప్షన్‌ ఇచ్చాడు.

మరొకవైపు తాను మళ్లీ గడ్డాన్ని పెంచాలని అనుకుంటున్నారా అని అభిమానుల్ని ప్రశ్నించాడు. ఇందుకు టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా స్పందించారు. ఈ లుక్‌ దాదాపు బాలేదని అర్ధం వచ్చేలా రిప్లై ఇచ్చిన సానియా.. మళ్లీ యువీని గడ్డంతో చూడాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ‘ గడ్డాన్ని తీసేసి నీ అట్రాక్టివ్‌ లుక్‌ను దాచేశావా’ అంటూ బదులిచ్చారు. మళ్లీ గడ్డం పెంచూ అంటూ యువీని ట్రోల్‌ చేశారు సానియా.

రోహిత్‌ శర్మను టెస్టుల్లో ఓపెనర్‌గా పంపాలంటూ అతనికి మద్దతుగా నిలిచిన మాజీ క్రికెటర్లలో యువీ ఒకడు. అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ఓపెనర్‌గా సక్సెస్‌ అయిన రోహిత్‌ టెస్టులకు సైతం ఓపెనర్‌గా సెట్‌ అవుతాడంటూ ధీమా వ్యక్తం చేశాడు. అదే సమయంలో కోహ్లి అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉండటం వల్ల భారం పడుతుందా అనే విషయాన్ని పరిశీలించాలన్నాడు.

New look 👀 chikna chamela !!😄🤪or should I bring back the beard 🧔?

A post shared by Yuvraj Singh (@yuvisofficial) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా