సెమీస్‌లో సానియా జంట

20 May, 2017 01:14 IST|Sakshi
సెమీస్‌లో సానియా జంట

రోమ్‌: తన కొత్త భాగస్వామి యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్‌)తో బరిలోకి దిగిన రెండో టోర్నమెంట్‌ రోమ్‌ ఓపెన్‌లో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సానియా–ష్వెదోవా ద్వయం 6–4, 6–1తో సారా ఎరాని–మార్టినా ట్రెవిసాన్‌ (ఇటలీ) జోడీపై గెలిచింది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ఆరు బ్రేక్‌ పాయింట్లు సాధించింది.

మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్‌ రెండో రౌండ్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–పాబ్లో క్యువాస్‌ (ఉరుగ్వే) ద్వయం 4–6, 7–6 (9/7), 10–8తో సూపర్‌ టైబ్రేక్‌లో ఏడో సీడ్‌ ఫెలిసియానో లోపెజ్‌–మార్క్‌ లోపెజ్‌ (స్పెయిన్‌) జోడీపై సంచలన విజయం సాధించింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు