చాంపియన్‌ సంజన

23 Nov, 2019 13:49 IST|Sakshi

ఐటీఎఫ్‌ గ్రేడ్‌–5 టోర్నీ టైటిల్‌ సొంతం

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) గ్రేడ్‌–5 టైటిల్‌ విజేతగా తెలంగాణ అమ్మాయి సంజన సిరిమల్ల నిలిచింది. గువాహటి వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్‌లో సంజన 5–7, 6–2, 6–4తో రేష్మా మరూరి (కర్ణాటక)పై విజయం సాధించింది. 3 గంటల 10 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి సెట్‌ను కోల్పోయిన సంజన... రెండో సెట్‌ నుంచి విజంభించింది.

తర్వాతి సెట్‌లలో ప్రత్యరి్థకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా రెండు సెట్‌లను గెలిచి చాంపియన్‌గా నిలిచింది. సెమీఫైనల్‌లో సంజన 6–4, 6–4తో మల్లిక మరాటీపై, క్వార్టర్స్‌లో 6–1, 6–0తో కనిక శివరమన్‌పై, ప్రిక్వార్టర్స్‌లో 6–2, 6–2తో అమీక్‌ కిరణ్‌పై, తొలి రౌండ్‌లో 6–2, 6–0తో సుహిత మరూరిపై గెలిచింది. టైటిల్‌ గెలిచిన సంజనను స్పాన్సర్, రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్స్‌ ఎండీ, చైర్మన్‌ డాక్టర్‌ రమేశ్‌ కంచర్ల అభినందించారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు