'టీమిండియాకు బౌలింగ్‌ సూపర్‌ స్టార్లు కావాలి'

23 Nov, 2017 11:56 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత భారత క్రికెట్‌ జట్టులో మ్యాచ్‌ ను మలుపుతిప్పగల బూమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌ వంటి బౌలర్లు ఉన్నా ఇంకా సూపర్‌ స్టార్లు బౌలింగ్‌ లో రావాల్సిన అవసరముందని ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు.గతంలో పాకిస్తాన్‌ క్రికెట్ జట్టును శాసించిన ఇమ్రాన​ ఖాన్‌, వసీం అక్రమ్‌ తరహాలో బౌలింగ్‌ సూపర్‌ స్టార్ల అవసరం భారత జట్టుకు చాలా ఉందన్నాడు.

'భారత క్రికెట్‌ జట్టులో అందరి దృష్టి బ్యాటింగ్‌ మీదే ఉంటుంది. పాకిస్థాన్‌ సంగతి అలా కాదు. ఎప్పుడు ఆ జట్టును చూసినా సూపర్‌ స్టార్లందరూ బౌలర్లే. ఇమ్రాన్‌ ఖాన్‌, వసీమ్‌, వకార్‌.. ఇలా బౌలర్లే ఆ దేశంలో హీరోలు. బ్యాటింగ్‌లో భారత్‌ గొప్ప ఆటగాళ్లను అందించింది. కానీ బౌలింగ్‌లో మాత్రం లేదు. ప్రస్తుతం బుమ్రా, భువనేశ్వర్‌ లాంటి ఆటను మలుపు తిప్పే ఆటగాళ్లను చూస్తున్నాం. ఈ పరిణామం మంచిది. ఐతే బ్యాట్స్‌మెన్‌ను ఆరాధించినట్లు బౌలర్లనూ ఆరాధించి వారిని హీరోలుగా చేయాల్సింది అభిమానులే. భారత్‌కు బౌలింగ్‌ సూపర్‌స్టార్లు రావాలి. అలా వస్తే తర్వాతి తరాలపై సానుకూల ప్రభావం ఉంటుంది'అని మంజ్రేకర్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు