గర్ల్‌ఫ్రెండ్‌తో సంజూ శాంసన్‌ పెళ్లి ఫిక్స్‌

10 Sep, 2018 11:03 IST|Sakshi

తిరువనంతపురం: టీమిండియా యువ క్రికెటర్‌ సంజూ శాంసన్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.  గత కొన్నేళ్లుగా డేటింగ్‌ చేస్తున్న తన గర్ల్‌ఫ్రెండ్‌ చారును డిసెంబరులో పెళ్లి చేసుకోనున్నట్టు ఈ కేరళ బ్యాట్స్‌మన్‌ ప్రకటించాడు. 23 ఏళ్ల సంజూ తన కళాశాల క్లాస్‌మేట్‌ అయిన చారును ఐదేళ్లక్రితం కలిశాడు. అప్పటినుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పటికీ, ఈ విషయం ఎప్పుడూ బహిర్గతం కానివ్వలేదు. అయితే, తమ ప్రేమకు ఇప్పుడు పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించిన విషయాన్ని సంజూ వెల్లడించాడు.

‘మేము ఇద్దరం కలిసి గడిపాం. కానీ ఎప్పుడూ బహిరంగంగా కలిసి మాత్రం తిరగలేదు. ఈరోజు మాత్రం మా పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. మా పెళ్లిని సంతోషంగా ఒప్పుకున్న తల్లిదండ్రులకు చాలా చాలా థాంక్స్. చారు వాళ్ల కుటుంబంతో మాట్లాడి పెళ్లిని కుదిర్చారు. మా పెళ్లికి డిసెంబర్‌ 22వ తేదీన ముహూర్తం కుదిరింది‌’ అని సంజూ శాంసన్‌ తెలిపాడు. చారు తండ్రి తిరువనంతపురంలో సీనియర్‌ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ‘2013, ఆగస్టు 22వ తేదీన చారుకు తొలిసారి ‘హాయ్‌’ చెప్పా. ఆ తర్వాత నుంచి మా బంధం క్రమేపీ బలపడుతూ వచ్చింది. ఇన్నాళ్లకు మా పెళ్లి డేట్‌ ఫిక్స్‌ అయ్యింది’ అని శాంసన్‌ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా