సామ్సన్‌పై వేటు

13 Jan, 2020 03:25 IST|Sakshi

న్యూజిలాండ్‌ పర్యటనకు భారత టి20 జట్టు ఎంపిక

వన్డే, టెస్టు జట్ల ఎంపిక వాయిదా

ముంబై: సొంతగడ్డపై ఆ్రస్టేలియాతో మూడు వన్డేలు ఆడాక భారత్‌ ఈ నెలలోనే న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ పూర్తిస్థాయిలో మూడు ఫార్మాట్లలోనూ సిరీస్‌లు ఆడనుంది. మొదట 5 టి20లు, ఆ వెంటే 3 వన్డేల సిరీస్‌ ఆడాక... మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతుంది. అనంతరం రెండు టెస్టుల్లో తలపడుతుంది. దీంతో ఆ మూడు జట్లను ఆదివారమే ఎంపిక చేస్తారని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి తొలుత ప్రకటించింది. కానీ ఇప్పటికైతే కేవలం టి20 జట్టును ఎంపిక చేశారు.

వన్డే, టెస్టు జట్లను తర్వాత ఎంపిక చేస్తారని బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఇక పొట్టి జట్టు ఎంపిక విషయానికొస్తే గత మూడు సిరీస్‌లుగా జట్టులో ఉంచి ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడించిన కేరళ వికెట్‌ కీపర్‌ సంజూ సామ్సన్‌పై వేటు పడింది. సీనియర్‌ పేసర్‌ షమీ, రోహిత్‌ శర్మలను జట్టులోకి తీసుకున్నారు. గత శ్రీలంక టి20 సిరీస్‌కు వీళ్లిద్దరికి విశ్రాంతి ఇచ్చారు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ముందు రంజీల్లో ఫిట్‌నెస్‌ నిరూపించుకున్నాకే అంతర్జాతీయ టోరీ్నలకు పరిగణించాలని సెలక్టర్లు భావించినట్లు తెలిసింది. కివీస్‌లో ఐదు టి20లు ఈ నెల 24, 26, 29, 31, ఫిబ్రవరి 2 తేదీల్లో జరుగున్నాయి.

భారత టి20 జట్టు: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, రాహుల్, ధావన్, అయ్యర్, పంత్, మనీశ్‌ పాండే, శివమ్‌ దూబే, కుల్దీప్‌ యాదవ్, యజువేంద్ర చహల్, బుమ్రా, శార్దుల్, నవదీప్‌ సైనీ, వాషింగ్టన్‌ సుందర్, రవీంద్ర జడేజా, షమీ.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా