టీమిండియాకు 'సక్లాయిన్' చెక్ పెడతాడా?

26 Oct, 2016 10:37 IST|Sakshi
టీమిండియాకు 'సక్లాయిన్' చెక్ పెడతాడా?

లండన్: వచ్చే నెలలో భారత గడ్డపై ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ ఆడనున్న ఇంగ్లండ్‌ తమ బలహీనతలను అధిగమించే ప్రయత్నంలో పడింది. అశ్విన్ లాంటి స్టార్‌ స్పిన్నర్‌ను ఎదుర్కోవడంతో పాటు తమ స్పిన్నర్ల నైపుణ్యం కూడా మెరుగుపర్చాలని భావిస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ సక్లాయిన్‌ ముస్తాక్‌ను ఈ సిరీస్‌ కోసం తమ స్పిన్‌ కన్సల్టెంట్‌గా నియమించింది. నవంబర్‌ 1న ఇంగ్లండ్‌ జట్టుతో చేరే సక్లాయిన్ 15 రోజుల పాటు ప్రత్యేకంగా జట్టుతో కలిసి పని చేస్తాడు. గతంలోనూ సక్లాయిన్‌ ఇంగ్లండ్‌తో పాటు వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లకు స్పిన్‌ సలహాదారుడిగా వ్యవహరించాడు.

ఇంగ్లండ్ స్పిన్నర్లకు తన సలహాలు ఉపయోగపడతాయన్న ఆశాభావాన్ని సక్లాయిన్‌ వ్యక్తం చేశాడు. భారత్ తో సిరీస్ లో మంచి ఫలితాలు రాబతామని చెప్పాడు. భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇండియా పర్యటనలో తనపట్ల ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం కాదని విశ్వాసం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సక్లాయిన్ ఇప్పుడు బ్రిటన్ పౌరుడిగా మారాడు.

మరిన్ని వార్తలు