మొన్న ట్రిపుల్‌ సెంచరీ.. మళ్లీ డబుల్‌ సెంచరీ

28 Jan, 2020 12:11 IST|Sakshi

ధర్మశాల: రంజీ ట్రోఫీలో ముంబై బ్యాట్స్‌మన్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ జోరు కొనసాగుతోంది. వారం రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన సర్ఫరాజ్‌ ఖాన్‌.. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ సాధించాడు. సోమవారం ప్రారంభమైన మ్యాచ్‌లో తొలి రోజు మూడో సెషన్‌లో సర్ఫరాజ్‌ డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు.   ఆది నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డ సర్పరాజ్‌ వందకుపైగా స్టైక్‌రేట్‌తో డబుల్‌ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం ద్విశతకతంతో అజేయంగా నిలిచి మరో ట్రిపుల్‌ సెంచరీ దిశగా సాగుతున్నాడు.(ఇక్కడ చదవండి: సర్ఫరాజ్‌ ట్రిపుల్‌ సెంచరీ)

213 బంతుల్లో 32 ఫోర్లు, 4 సిక్సర్లతో 226 పరుగులతో  ఉన్నాడు. కాగా, రెండో రోజు ఆటకు వరుణుడు అంతరాయం కల్గించాడు. దాంతో మ్యాచ్‌ ప్రారంభం కావడానికి ఆలస్యం కానుంది.నిన్నటి ఆటలో 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబై జట్టును సర్ఫరాజ్‌ తన వీరోచిత బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. బౌలర్‌ ఎవరన్నది చూడకుండా బౌండరీలే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే తొలుత సెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్‌.. దాన్ని డబుల్‌ సెంచరీగా మార్చుకున్నాడు. ఐదో వికెట్‌కు ఆదిత్య తారేతో కలిసి 140 భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.  తొలి రోజు ఆట ముగిసే సమయానికి అజేయంగా ఉన్న సర్ఫరాజ్‌ ఖాన్‌.. రెండో రోజు ఆటలో మరి డబుల్‌ సెంచరీని ట్రిపుల్‌గా మార్చుకుంటాడో లేదో చూడాలి. 

మరిన్ని వార్తలు