క్వార్టర్స్‌లో సర్జూబాల

24 May, 2016 00:28 IST|Sakshi

అస్తానా (కజకిస్తాన్): ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సోమవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సర్జూబాలా దేవి (48 కేజీలు), సీమా పూనియా (+ 81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... పవిత్ర (64 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్ర్కమించింది.

ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మాజీ ప్రపంచ జూనియర్ చాంపియన్ సర్జూబాలా దేవి 3-0తో ఎరాండి కలుహత్ (శ్రీలంక)పై, సీమా 3-0తో ఐనుర్ జయేవా (అజర్‌బైజాన్)పై గెలిచారు. పవిత్ర 0-3తో స్కయ్ నికొల్సన్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు