చాంప్స్‌ శశాంక్, విరాణి

10 Jul, 2019 13:56 IST|Sakshi

‘స్లాన్‌’ మైండ్‌ గేమ్స్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: స్పోర్ట్స్‌ లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌ (స్లాన్‌) మైండ్‌ గేమ్స్‌ చాంపియన్‌షిప్‌లో శశాంక్, విరాణి ఆకట్టుకున్నారు. అండర్‌–16 చెస్, స్క్రాబుల్‌ టోర్నీలో వీరిద్దరూ విజేతలుగా నిలిచారు. మంగళవారం జరిగిన అండర్‌–16 చెస్‌ పోటీల్లో 4.5 పాయింట్లతో శశాంక్, ఆనంద్‌ దత్తా అగ్రస్థానం కోసం పోటీపడ్డారు.

మెరుగైన టై బ్రేక్‌ స్కోర్‌ ఆధారంగా శశాంక్‌ విజేతగా, ఆనంద్‌ రన్నరప్‌గా నిలిచారు. జ్యోతి జీవన్‌ 4 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. స్క్రాబుల్‌ ఈవెంట్‌లో సియాన్‌ విరాణి, ప్రాప్తి అగర్వాల్, ఐశ్వర్య నాయుడు వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. అండర్‌–12 చెస్‌ విభాగంలో నందసాయి వినేశ్‌ (5 పాయింట్లు), విఘ్నేశ్‌ అద్వైత్‌ (5 పాయిం ట్లు)... అండర్‌–9 చెస్‌లో  శ్రీనీత్, అక్షయ లక్ష్మిరెడ్డి తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు.   

మరిన్ని వార్తలు