ఎస్‌బీహెచ్ ఘనవిజయం

1 Aug, 2014 23:41 IST|Sakshi

హడలెత్తించిన విశాల్, అశ్విన్
 ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్
 
 సాక్షి, హైదరాబాద్: విశాల్ శర్మ (4/15), అశ్విన్ యాదవ్ (4/38) హడలెత్తించడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) జట్టు ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో కేంబ్రిడ్జ్ ఎలెవన్‌పై ఘనవిజయం సాధించింది. ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో శుక్రవారం 17/1 స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన కేంబ్రిడ్జ్ ఎలెవన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ చేతులెత్తేసింది. 46.4 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది.
 
  హైదర్ అలీ (111 బంతుల్లో 56, 10 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌ల్లో ఎస్‌బీహెచ్ 353, కేంబ్రిడ్జ్ ఎలెవన్ 154 పరుగులు చేశాయి. ఇన్నింగ్స్ విజయంతో ఎస్‌బీహెచ్ 16 పాయింట్లు సంపాదించగా, కేంబ్రిడ్జ్‌కు 2 పాయింట్లు దక్కాయి. నగరంలోని వివిధ మైదానాల్లో వర్షం వల్ల రెండు ఇన్నింగ్స్‌ల పాటు ఆట సాధ్యపడని మిగతా మ్యాచ్‌లన్నీ డ్రాగా ముగిశాయి.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 202 (మహంతి 42, రాధాకృష్ణ 45; సీవీ మిలింద్ 3/53, షాదాబ్
 తుంబి 3/59, రాజేంద్ర 3/52), డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 218/7 (అక్షత్ రెడ్డి 56, పార్థ్‌జాల 52 , పరాశర్ 3/81).
 
 కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 503/3 (ఆరోన్ పాల్ 151 నాటౌట్, వైభవ్ 101 నాటౌట్; ఇంద్రశేఖర్ 2/104), ఆర్. దయానంద్ తొలి ఇన్నింగ్స్: 189/8 (భగత్ వర్మ 50, విజయ్ గౌడ్ 43; వైభవ్ 3/22, చందన్ సహాని 2/30, సూర్యప్రసాద్ 2/37).
 
 ఏఓసీ తొలి ఇన్నింగ్స్: 221, రెండో ఇన్నింగ్స్: 130 (విష్ణు తివారి 41, పెంటా రావు 48; శబరీష్ 2/48) బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 117 (సాయిచరణ్ 46; దివేశ్  3/32, రితేశ్ నేగి 3/30, కోటేశ్వర్ రావు 2/10).
 

మరిన్ని వార్తలు