వారెవ్వా.. రాహుల్ : భారత్ స్కోర్ 358/5

1 Aug, 2016 22:53 IST|Sakshi
వారెవ్వా.. రాహుల్ : భారత్ స్కోర్ 358/5

సెంచరీతో చెలరేగిన ఓపెనర్ రాహుల్
162 పరుగుల ఆధిక్యంలో భారత్
విండీస్‌తో రెండో టెస్టు

 
కింగ్‌స్టన్: భారత ఓపెనర్ బ్యాట్స్‌మన్ కెఎల్‌ రాహుల్ (303 బంతుల్లో 158; 15 ఫోర్లు, 3 సిక్స్) రెండో టెస్టులో చెలరేగిపోయాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 125 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. రహానే 42, సాహా 17 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

ఓవర్‌నైట్ స్కోరు 126/1తో ఇన్నింగ్స్ కొనసాగించిన రాహుల్, పుజారా నిలకడగా ఆడారు. చేజ్ బౌలింగ్‌లో రాహుల్ భారీ సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో అతనికిది మూడో సెంచరీ. రెండో వికెట్‌కు పుజారా, రాహుల్ 121 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. పుజారా 159 బంతుల్లో 46; 4 ఫోర్లు చేసి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ మూడో వికెట్‌కు రాహుల్‌తో కలిసి 69 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకోల్పాడు.

డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్న రాహుల్‌ను విండీస్ బౌలర్ గాబ్రియెల్ ఔట్ చేశాడు. కోహ్లీ 90 బంతుల్లో 44; 4 ఫోర్లుతో , ఒక సిక్సర్ చేసి రోస్టన్ చేజ్ బౌలింగ్‌లో చంద్రికకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో భారత్ స్వల్ప వ్యవధిలోనే కోహ్లీ, అశ్విన్ వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 162 పరుగుల ఆధిక్యంలో ఉంది. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్‌ రెండు వికెట్లు, గాబ్రియేల్, బిషూ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 52.3 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.


వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: బ్రాత్‌వైట్ (సి) పుజారా (బి) ఇషాంత్ 1; చంద్రిక (సి) రాహుల్ (బి) షమీ 5; బ్రేవో (సి) కోహ్లి (బి) ఇషాంత్ 0; శామ్యూల్స్ (సి) రాహుల్ (బి) అశ్విన్ 37; బ్లాక్‌వుడ్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 62; చేజ్ (సి) ధావన్ (బి) షమీ 10; డోవ్రిచ్ (సి) సాహా (బి) అశ్విన్ 5; హోల్డర్ (సి) రాహుల్ (బి) అశ్విన్ 13; బిషూ (సి) ధావన్ (బి) అశ్విన్ 12; కమిన్స్ నాటౌట్ 24; గాబ్రియెల్ (సి) కోహ్లి (బి) మిశ్రా 15; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (52.3 ఓవర్లలో ఆలౌట్) 196.

వికెట్ల పతనం: 1-4, 2-4, 3-7, 4-88, 5-115, 6-127, 7-131, 8-151, 9-158, 10-196.; బౌలింగ్: ఇషాంత్ 10-1-53-2; షమీ 10-3-23-2; అశ్విన్ 16-2-52-5; ఉమేశ్ 6-1-30-0; మిశ్రా 10.3-3-38-1.

భారత్ తొలి ఇన్నింగ్స్: లోకేశ్ రాహుల్ (సి) డోవ్రిచ్  (బి)  గాబ్రియెల్ 158; ధావన్ (సి) బ్రేవో (బి) చేజ్ 27; పుజారా రనౌట్ 46; కోహ్లి (సి) చంద్రిక (బి) చేజ్ 44; రహానే బ్యాటింగ్ 42; అశ్విన్ (సి) బ్రేవో (బి) బిషూ 3; సాహా బ్యాటింగ్ 17; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (125 ఓవర్లలో 5 వికెట్లకు) 358.

వికెట్ల పతనం: 1-87; 2-208; 3-277; 4-310; 5-327
బౌలింగ్: గాబ్రియెల్ 23-8-50-1; కమిన్స్ 15.4-3-54-0; హోల్డర్ 23.2-9-49-0; చేజ్ 29-3-91-2; బిషూ 25-3-79-1; బ్రాత్‌వైట్ 9-0-26-0.

మరిన్ని వార్తలు