రెండో టి20లో కివీస్ గెలుపు

7 Dec, 2014 00:43 IST|Sakshi
రెండో టి20లో కివీస్ గెలుపు

పాక్‌తో సిరీస్ 1-1తో సమం
 దుబాయ్: బౌలర్ల ప్రతిభతో తక్కువ స్కోరును కాపాడుకున్న న్యూజిలాండ్ జట్టు... పాకిస్తాన్‌తో జరిగిన రెండో టి20లో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. విలియమ్సన్ (32), రోంచీ (31), లాథమ్ (26), డివిచ్ (21) రాణించారు.
 
 పాక్ బౌలర్లలో గుల్, ఆఫ్రిది చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 18.5 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. షెహజాద్ (33) టాప్ స్కోరర్. ఆఫ్రిది (28), నజీమ్ (19) మినహా మిగతా వారు విఫలమయ్యారు. మిల్స్, నీషమ్ చెరో 3 వికెట్లు తీయగా, డివిచ్‌కు 2 వికెట్లు దక్కాయి. డివిచ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; రోంచీకి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ సోమవారం నుంచి జరుగుతుంది.
 

మరిన్ని వార్తలు