ఎల్గర్‌ శతకం

3 Jan, 2017 00:13 IST|Sakshi
ఎల్గర్‌ శతకం


దక్షిణాఫ్రికా 297/6
లంకతో రెండో టెస్టు  

కేప్‌టౌన్‌: తడబడిన దక్షిణాఫ్రికా జట్టును ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ (230 బంతుల్లో 129; 15 ఫోర్లు) సెంచరీతో ఆదుకున్నాడు. శ్రీలంకతో సోమవారం మొదలైన రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. స్టీఫెన్‌ కుక్‌ (0), డుమినీ (0) డకౌట్‌ కాగా... 66 పరుగులకే మూడు టాపార్డర్‌ వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ఎల్గర్‌ ముందుండి నడిపించాడు. ఆట నిలిచే సమయానికి డికాక్‌ (90 బంతుల్లో 68 బ్యాటింగ్‌; 7 ఫోర్లు), అబాట్‌ (16 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. లంక బౌలర్లలో లహిరు కుమార 3, లక్మల్‌ 2 వికెట్లు తీశారు.  

అలీమ్‌ దార్‌ ప్రపంచ రికార్డు  
క్రికెట్‌ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లకు (332) ఫీల్డ్‌ అంపైర్‌గా వ్యవహరించిన వ్యక్తిగా అలీమ్‌ దార్‌ (పాకిస్తాన్‌) కొత్త రికార్డు నెలకొల్పారు. గతంలో రూడీ కొయెర్ట్‌జన్‌ (దక్షిణాఫ్రికా – 331) పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించారు.

మరిన్ని వార్తలు