తెలంగాణ నుంచి ఒకరు... ఆంధ్ర నుంచి ఒకరు

22 Jun, 2014 01:10 IST|Sakshi
తెలంగాణ నుంచి ఒకరు... ఆంధ్ర నుంచి ఒకరు

కామన్వెల్త్ గేమ్స్‌కు అథ్లెట్ల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ జట్టులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు అథ్లెట్లకు అవకాశం దక్కింది. తెలంగాణకు చెందిన మొహమ్మద్ బాబా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మణికందన్‌రాజ్ సీడబ్ల్యూజీ-2014కు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోనే పోలీస్ విభాగంలో బాబా విధులు నిర్వర్తిస్తుండగా... మణికందన్ రాజ్ ఎస్‌సీ రైల్వే (విజయవాడ)లో పని చేస్తున్నారు. ఇటీవల జరిగిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో చూపిన ప్రదర్శన కారణంగా వీరిద్దరు అర్హత సాధించారు. ఈ ఇద్దరు అథ్లెట్లు బెంగళూరులో జరుగుతున్న భారత జట్టు శిక్షణ శిబిరంలో చేరారు. జులై 23నుంచి ఆగస్ట్ 3 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో కామన్వెల్త్ పోటీలు జరగనున్నాయి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు