జింబాబ్వేతో వన్డే సిరీస్ కు సీనియర్లకు విశ్రాంతి!

4 Jul, 2013 13:01 IST|Sakshi
జింబాబ్వేతో వన్డే సిరీస్ కు సీనియర్లకు విశ్రాంతి!

జింబాబ్వేతో వన్డే సిరీస్ కు టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తోంది. జింబాబ్వేలో జరగనున్న ఐదు వన్డేల సిరీస్ కు భారత జట్టును శుక్రవారం సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. చాంపియన్స్ ట్రోఫీని గెల్చుకున్న జట్టునే వెస్టిండీస్ లో ముక్కోణపు టోర్నికి పంపారు.  

గాయం కారణంగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికే ముక్కోణపు టోర్నికి దూరమయ్యారు. జూలే 24 నుంచి ప్రారంభం నుంచి జింబాబ్వే వన్డే సిరీస్ కు అతడు అందుబాటులో ఉంటాడో, లేదో ఇంకా తేలలేదు. మరోవైపు గత కొన్ని నెలలుగా ఆటగాళ్లు వరుసగా మ్యాచ్ లు ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి విశ్రాంతి ఇవ్వాలనేది సెలక్షన్ కమిటీ నిర్ణయించనుంది. ఒకవేళ ధోని విశ్రాంతి కోరుకుంటే అతడి స్థానంలో విరాట్ కోహ్లి జట్టుకు నాయకత్వం వహిస్తాడు. మరో ప్రత్యామ్నాయంగా సీనియర్ గౌతమ్ గంభీర్ ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశముంది.

ఇక ధోని స్థానంలో జట్టులోకి వచ్చిన తెలుగు కుర్రాడు అంబటి రాయుడును కొనసాగించే ఛాన్సుంది. ఇర్పాన్ పఠాన్ ప్లేస్ లో వచ్చిన షమీ అహ్మద్ ను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసే వీలుంది. గాయం నుంచి కోలుకున్న ఛతేశ్వర్ పూజారా,  బౌలర్ ప్రవీణ్ కుమార్ కూడా జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకరిద్దరు సీనియర్లకు విశ్రాంతి నిస్తే వీరికి చోటు దక్కవచ్చు.
 

మరిన్ని వార్తలు