ఇండోనేసియా మాస్టర్స్‌ ఫైనల్స్‌లో సైనా

27 Jan, 2018 16:34 IST|Sakshi

జకర్తా: భారత స్టార్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ ఇండోనేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి, ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ ఇంతనోన్‌ రచనోక్‌తో తలపడిన సైనా.. ప్రత్యర్థిని చిత్తు చేసింది. 49 నిమిషాల పాటు జరిగిన హోరాహోరి పోరులో సైనా 21-19, 21-19 తో మ్యాచ్‌ను గెలుచుకుని ఫైనల్‌కు చేరింది.

గత ఏడాది గాయాలతో అంతగా రాణించలేకపోయిన సైనా తిరిగి కోలుకున్న అనంతరం ఈ ఏడాది పాల్గొన్న తొలి టోర్నమెంట్‌లోనే ఫైనల్‌కు చేరింది. ప్రపంచ నెం.1 తైజు యింగ్, ఎనిమిదో ర్యాంకర్‌ బింగ్‌జియో మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌ విజేతతో సైనా ఆదివారం జరుగనున్న ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడనుంది. 

కాగా శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో పీవీ సింధుతో జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ సైనా నెహ్వాల్‌ గెలిచి సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. 37 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ సైనా 21–13, 21–19 తో సింధును ఓడించింది. 

 

మరిన్ని వార్తలు