సెరెనా వర్సెస్‌ వీనస్‌

30 Aug, 2018 14:09 IST|Sakshi

న్యూయార్క్‌: యూఎస్‌ గ్రాండ్‌ స్లామ్‌ ఓపెన్‌లో అక్కా చెల్లెళ్లు సెరెనా విలియమ్స్‌-వీనస్‌ విలియమ్స్‌ల పోరుకు రంగ సిద్దమైంది.  ఈ టోర్నీలో మూడో రౌండ్‌లో వీరిద్దరూ తలపడబోతున్నారు.  రికార్డు స్థాయిలో 24వ సింగిల్స్‌ గ్రాండ్‌ స్లామ్‌ గెలవాలని ఉవ్విళ్లూరుతున్న సెరెనా విలియమ్స్‌.. రెండో రౌండ్‌లో 6-2, 6-2 తేడాతో జర్మనీ క్రీడాకారిణి కరినా వితాఫ్ట్‌పై విజయం సాధించి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. మరోపక్క ఇటలీ క్రీడాకారిణి కమిలా జియార్జిపై 6-4, 7-5తో విజయం సాధించి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది వీనస్‌‌. దాంతో వీరిద్దరూ ప్రత్యర్థులుగా మూడో  రౌండ్‌లోనే అమీతుమీ తేల్చుకోనున్నారు. 

ఓవరాల్‌గా ప్రత్యర్థులుగా సెరెనా-వీనస్‌లు తలపడటం ఇది 30వ సారి. ఇప్పటి వరకు వీరిద్దరూ 29 సార్లు ప్రత్యర్థులుగా తలపడగా సెరెనా 17 సార్లు... వీనస్‌ 12 సార్లు విజయం సాధించారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం వీరిద్దరి మధ్య మ్యాచ్‌ జరగనుంది. వీరిద్దరూ కలిసి 30 గ్రాండ్‌ స్లామ్‌ టైటల్స్‌ను సాధించారు. అందులో సెరెనా 23 గ్రాండ్‌ స్లామ్‌ టైటల్స్‌ సాధించగా, వీనస్‌ ఏడు గ్రాండ్‌ స్లామ్‌ టైటల్స్‌ను దక్కించుకుంది. మరొకవైపు పురుషుల సింగిల్స్‌లో వరల్డ్‌ నంబర్‌వన్‌, స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ మూడో రౌండ్‌లోకి ప‍్రవేశించాడు. రెండో రౌండ్‌లో 6-3, 6-4, 6-2 తేడాతో కెనాడా ప్లేయర్‌ వాసెక్‌ పాస్పిసిల్‌పై వరుస సెట్లలో గెలిచి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా