మళ్లీ టాప్‌కు చేరిన కివీస్‌

4 Jan, 2018 13:23 IST|Sakshi

దుబాయ్‌:వెస్టిండీస్‌తో మూడు టీ 20ల సిరీస్‌ను 2-0తో గెలిచిన న్యూజిలాండ్‌ టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో కివీస్‌ 126 పాయింట్లతో ప్రథమ స్థానాన్ని ఆక‍్రమించింది. బుధవారం జరిగిన చివరిదైన మూడో టీ 20లో న్యూజిలాండ్‌ 119 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఫలితంగా సిరీస్‌ ను కైవసం చేసుకున్న న్యూజిలాండ్‌ ఆరు పాయింట్లను ఖాతాలో వేసుకుని అగ్రస్థానాన్ని తిరిగి చేజిక్కింకుంది.

గతేడాది నవంబర్‌లో భారత్‌ తో జరిగిన టీ 20 సిరీస్‌ను కివీస్‌ కోల్పోవడంతో పాకిస్తాన్‌ టాప్‌కు చేరింది. దాదాపు రెండు నెలల్లోనే మళ్లీ న్యూజిలాండ్‌ ప్రథమ స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌(124) రెండో స్థానానికి పరిమితం కాగా, భారత్‌ జట్టు(121) మూడో స్థానంలో నిలిచింది. ఇక‍్కడ వెస్టిండీస్‌ ఐదు పాయింట్లను కోల్పోయి ఐదో స్థానంలో ఉంది. మరొకవైపు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు వరుసగా ఆరు, ఏడు,ఎనిమిదో స్థానాల్లో నిలిచాయి. టీ 20 ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్‌ తొమ్మిదో స్థానంలో, బంగ్లాదేశ్‌ పదో స్థానంలో ఉన్నాయి.

ఇదిలా ఉంచితే, న్యూజిలాండ్‌ టాప్‌ ప్లేస్‌ను నిలబెట్టుకోవాలంటే త్వరలో పాకిస్తాన్‌తో జరిగే టీ 20సిరీస్‌ను గెలవాల్సి ఉంది. న్యూజిలాండ్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య కేవలం రెండు పాయింట్ల మాత‍్రమే అంతరం ఉంది. దాంతో పాకిస‍్తాన్‌తో జరిగే సిరీస్‌ను కివీస్‌ 2-1తో గెలవాల్సి ఉంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యు ముంబా చిత్తుచిత్తుగా

బీసీసీఐలో భగ్గుమన్న విభేదాలు

సైన్యంలోకి ధోని.. మాజీ క్రికెటర్‌ ఎగతాళి

‘ఆ క్రెడిట్‌ అంతా గంభీర్‌దే’

‘రిటైర్‌ అవ్వను.. అందుబాటులో ఉండను’

‘ఇక పాక్‌ క్రికెట్‌ జట్టును నేను సెట్‌ చేస్తా’

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

ఓడితే బ్యాట్‌ పట్టుకునే వాడిని కాదు: ఇంగ్లండ్‌ క్రికెటర్‌

సచిన్‌ సూచనకు ఓటేసిన బౌలింగ్‌ కోచ్‌

కేదార్‌ జాదవ్‌ ఎందుకు బాస్‌?

ధోని దరఖాస్తుకు ఆమోద ముద్ర!

శుబ్‌మన్‌ గిల్‌ టాప్‌ లేపాడు..

సలామ్‌ బాస్‌: రిషభ్‌

శ్రీశ్వాన్‌కు ఐఎం హోదా

విజేతలు సచిన్, ప్రహర్షిత

మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌

రన్నరప్‌తో సరి

శ్రీజ తడాఖా

నాది నిర్ణయలోపమే

క్వార్టర్స్‌లో నిఖత్‌

రాయుడిపై వివక్ష లేదు

విండీస్‌ సిరీస్‌కు సై

నచ్చారండి.. హిమదాస్‌

నేను పొరపాటు చేశా: వరల్డ్‌కప్‌ ఫైనల్‌ అంపైర్‌

రాయుడు ట్వీట్‌ను ఆస్వాదించా : ఎమ్మెస్కే

‘శారీ ట్విటర్‌’ .. క్రికెటర్‌కు ముద్దు పెట్టింది

అది ధోనికి తెలుసు: ఎమ్మెస్కే ప్రసాద్‌

సింధుని వీడని ఫైనల్‌ ఫోబియా!

విండీస్‌తో ఆడే భారత జట్టు ఇదే

ముగిసిన మేఘన పోరాటం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాజా చలో ఢిల్లీ

తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా

ముద్దులు పెడితే సినిమాలు నడుస్తాయా?

సూర్యకు నటన రాదనుకున్నా!

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’