టీమిండియా ఏడోసారి..

10 Feb, 2019 15:02 IST|Sakshi

హామిల్టన్‌:  అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ జట్టు తొలుత ఫీల్డింగ్‌ చేసి ప్రత్యర్థి జట్టుకు రెండొందలకు పైగా పరుగుల్ని సమర్పించుకోవడం ఇది ఏడోసారి. ఆదివారం భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో న్యూజిలాండ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ రెండొందలకు పైగా పరుగుల్ని సాధించి భారత్‌కు సవాల్‌ విసిరింది. తద్వారా టీ20ల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు టీమిండియాపై రెండొందలకు పైగా పరుగుల్ని సాధించడం ఏడోసారిగా నిలిచింది. ఈ సిరీస్‌లోనే న్యూజిలాండ్‌ రెండుసార్లు రెండొందలకు పైగా పరుగుల్ని సాధించడం విశేషం. వెల్టింగ్టన్‌లో జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్‌ 219 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.

ఫలితంగా ఒక ద్వైపాక్షికి టీ20 సిరీస్‌లో భారత్‌ రెండొందలు, అంతకంటే ఎక్కువ పరుగుల్ని ప్రత్యర్థికి సమర్పించుకోవడం రెండోసారిగా నమోదైంది. అంతకుముందు 2009లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో భారత్‌ రెండు మ్యాచ్‌ల్లో రెండొందల పరుగుల్ని సమర్పించుకుంది. అయితే మొహాలీలో లంకేయులు 207 లక్ష్యాన్ని నిర్దేశించగా దాన్ని భారత్‌ ఛేదించింది. ఓవరాల్‌గా ప్రత్యర్థి జట్టు రెండొందలకు పైగా లక్ష్యాన్ని నిర్దేశించిన గత ఆరు సందర్భాలకు గాను భారత్‌ రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది. 2013లో ఆసీస్‌ నిర్దేశించిన 202 పరుగుల్ని భారత్‌ ఛేదించింది.

మరిన్ని వార్తలు