చెన్నై x కోల్‌కతా

3 Oct, 2014 07:18 IST|Sakshi
చెన్నై x కోల్‌కతా

వరుసగా రెండో ఏడాది చాంపియన్స్ లీగ్ టి20 టోర్నమెంట్ టైటిల్ ఐపీఎల్ జట్టుకే దక్కనుంది. ఐపీఎల్ జట్లయిన కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ అంతిమ సమరానికి అర్హత సాధించాయి. సెమీఫైనల్స్‌లో  కోల్‌కతా ఏడు వికెట్ల తేడాతో హోబర్ట్ హరికేన్స్ జట్టుపై, చెన్నై సూపర్ కింగ్స్ 65 పరుగుల ఆధిక్యంతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌పై గెలిచాయి. ఫైనల్ శనివారం బెంగళూరులో జరుగుతుంది.
 
సెమీస్‌లో ఓడిన పంజాబ్, హోబర్ట్ జట్లు  
అవానా ‘హ్యాట్రిక్’ వృథా  
రాణించిన కలిస్  
బ్రేవో మెరుపు ఇన్నింగ్స్
చాంపియన్స్ లీగ్
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ చాంపియన్స్ లీగ్‌లో తమ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. టి20ల్లో వరుసగా 14వ విజయం సాధించిన కోల్‌కతా జట్టు గురువారం ఇక్కడి ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్లో 7 వికెట్ల తేడాతో హోబర్ట్ హరికేన్స్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హోబర్ట్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 140 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (46 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, డంక్ (29 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం నైట్‌రైడర్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 141 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జాక్ కలిస్ (40 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్‌తో ముందుండి నడిపించగా... మనీశ్ పాండే (32 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.
 
ఐపీఎల్‌లో దాదాపు 200 పరుగుల లక్ష్యాలను కూడా అవలీలగా ఛేదించిన పంజాబ్‌కు ఈ సారి కలిసి రాలేదు. పటిష్టమైన చెన్నైతో నాటి ప్రదర్శనను ఆ జట్టు పునరావృతం చేయలేకపోయింది. చాంపియన్స్ లీగ్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు నెగ్గిన ఆ జట్టు సెమీస్‌లో చేతులెత్తేసింది. రెండో సెమీఫైనల్లో చెన్నై 65 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డ్వేన్ బ్రేవో (39 బంతుల్లో 67; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, డు ప్లెసిస్ (33 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. పంజాబ్ బౌలర్ పర్వీందర్ అవానా హ్యాట్రిక్ సాధించాడు. తన రెండో ఓవర్ చివరి బంతికి రైనాను అవుట్ చేసిన అతను...మూడో ఓవర్ తొలి రెండు బంతులకు నేగి, ధోనిలను పెవిలియన్ పంపించాడు. అనంతరం పంజాబ్ 18.2 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. అక్షర్ పటేల్ (18 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
 
స్కోరు వివరాలు: హోబర్ట్ హరికేన్స్ ఇన్నింగ్స్: డంక్ (సి) గంభీర్ (బి) కుల్దీప్ 39; మైకేల్ (సి) అండ్ (బి) రసెల్ 0; బ్లిజార్డ్ (ఎల్బీ) (బి) పఠాన్ 0; మాలిక్ (నాటౌట్) 66; బిర్ట్ (సి) డస్కటే (బి) నరైన్ 13; వెల్స్ (బి) చావ్లా 3; గల్బిస్ (రనౌట్) 15; హిల్ఫెన్హాస్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 140
 వికెట్ల పతనం: 1-4; 2-13; 3-46; 4-77; 5-91; 6-135; బౌలింగ్: యూసుఫ్ పఠాన్ 4-0-24-1; రసెల్ 4-0-24-1; నరైన్ 4-0-24-1; కుల్దీప్ 4-0-31-1; చావ్లా 4-0-35-1.
 
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (బి) డోహర్తి 17; గంభీర్ (సి) వెల్స్ (బి) బొలింజర్ 4; కలిస్ (నాటౌట్) 54; పాండే (సి) మాలిక్ (బి) లాఫ్లిన్ 40; పఠాన్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (19.1 ఓవర్లలో 3 వికెట్లకు) 141
 వికెట్ల పతనం: 1-20; 2-44; 3-107.
 బౌలింగ్: హిల్ఫెన్హాస్ 4-0-28-0; బొలింజర్ 3.1-0-26-1; డోహర్తి 4-0-28-1; గల్బిస్ 4-0-23-0; లాఫ్లిన్ 4-0-36-1.
 
స్కోరు  వివరాలు: చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) అవానా 14; మెకల్లమ్ (సి) అవానా (బి) పెరీరా 6; రైనా (సి) బెయిలీ (బి) అవానా 6; డు ప్లెసిస్  (బి) అక్షర్ 46; బ్రేవో (సి) మ్యాక్స్‌వెల్ (బి) అక్షర్ 67; నేగి (బి) అవానా 8; ధోని (సి) కరణ్‌వీర్ (బి) అవానా 0; జడేజా (నాటౌట్) 27; అశ్విన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 182
 వికెట్ల పతనం: 1-23; 2-29; 3-41; 4-106; 5-141; 6-141; 7-160. బౌలింగ్: అనురీత్ 4-0-44-0; అవానా 4-0-30-4; పెరీరా 4-0-41-1; కరణ్‌వీర్ 4-0-36-0; అక్షర్ పటేల్ 4-0-30-2.
 
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) మెకల్లమ్ (బి) మోహిత్ 0; వోహ్రా (సి) డు ప్లెసిస్ (బి) వోహ్రా 16; సాహా (బి) నెహ్రా 6; మ్యాక్స్‌వెల్ (సి) ధోని (బి) నెహ్రా 0; మిల్లర్ (బి) అశ్విన్ 22; బెయిలీ (సి) మెకల్లమ్ (బి) నేగి 6; పెరీరా (సి) బ్రేవో (బి) నేగి 0; అక్షర్ (బి) రైనా 31; కరణ్‌వీర్ (నాటౌట్) 17; అవానా (సి) డు ప్లెసిస్ (బి) రైనా 0; అనురీత్ (సి) రైనా (బి) జడేజా 16; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 117
వికెట్ల పతనం: 1-3; 2-24; 3-24; 4-24; 5-34; 6-34; 7-61; 8-90; 9-90; 10-117; బౌలింగ్: నెహ్రా 3-0-9-2; మోహిత్ 3-0-14-2; అశ్విన్ 4-0-33-1; నేగి 4-0-28-2; జడేజా 1.2-0-9-1; రైనా 2-0-10-2; బ్రేవో 1-0-12-0.

మరిన్ని వార్తలు